Cricket Special: ఒకే మ్యాచ్ లో స్పిన్, స్పీడ్ బౌలింగ్ వేసిన బౌలర్లు ఎవరో తెలుసా?
క్రికెట్‌లో బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్ కాస్త కఠినమని చెప్పాలి. బౌలర్లు సరైన లైన్, లెంగ్త్ లేకుండా బంతిని వేస్తే, బ్యాటర్ వెంటనే బౌండరీలతో జవాబిస్తాడు. దీన్ని నియంత్రించడానికి, బౌలర్లు సుదీర్ఘకాలం సాధన చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారికీ క్రికెట్‌లో నిలకడగా రాణించే అవకాశం ఉంటుంది. స్పిన్నర్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ నేపధ్యంలో ఒకే మ్యాచ్‌లో స్పీడ్, స్పిన్ బౌలింగ్ వేసిన ఐదుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
మార్నస్ లబుషేన్
ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లబుషేన్ పాకిస్థాన్‌తో జరిగిన కరాచీ టెస్టు మ్యాచ్‌లో స్పిన్, మీడియం పేస్ బౌలింగ్ చేశాడు. లెగ్ స్పిన్నర్ అయిన లబుషేన్, పిచ్ పేస్‌కు అనుకూలం కావడంతో మొదటి ఇన్సింగ్స్‌లో మీడియం పేస్ వేశాడు. రెండో ఇన్సింగ్స్‌లో పిచ్ టర్న్ అవ్వడంతో స్పిన్ బౌలింగ్ చేసాడు. కోలిన్ మిల్లర్ ఆస్ట్రేలియాకు చెందిన పేసర్ కోలిన్ మిల్లర్ తన కెరీర్ చివరలో పేసర్ నుంచి ఆఫ్ స్పిన్నర్‌గా మారాడు. 2000లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు ఆఫ్ స్పిన్ వేశాడు, అలాగే రైడ్ హ్యాండ్ బ్యాటర్ మాథ్యూ సింక్లెయిర్ కు పేస్ వేశాడు.
మనోజ్ ప్రభాకర్
భారత పేసర్ మనోజ్ ప్రభాకర్ 1996 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మొదటి రెండు ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వడంతో కెప్టెన్ సూచనతో స్పిన్ బౌలింగ్ కూడా వేశాడు. సోహైల్ తన్వీర్ పాకిస్థాన్ సీమర్ సోహైల్ తన్వీర్ తన రెండు టెస్టుల కెరీర్‌లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ టెస్టులో పేస్‌తో పాటు స్పిన్ కూడా వేసాడు. పిచ్ పేసర్లకు అనుకూలం కాకపోవడం వలన తన్వీర్ స్పిన్ బౌలింగ్ వేశాడు. సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, సీమ్ అప్, మీడియం పేస్ బౌలింగ్ చేయగలడు. అందుకే కొన్ని మ్యాచుల్లో సచిన్ స్పిన్ , మీడియం పేస్ బౌలింగ్ చేశాడు.