Page Loader
IPL 2025: "షారుక్ ఖాన్ శ్రేయాస్ అయ్యర్‌ని వెళ్ళనివ్వడని నేను భావిస్తున్నాను": ఆకాష్ చోప్రా
"షారుక్ ఖాన్ శ్రేయాస్ అయ్యర్‌ని వెళ్ళనివ్వడని నేను భావిస్తున్నాను": ఆకాష్ చోప్రా

IPL 2025: "షారుక్ ఖాన్ శ్రేయాస్ అయ్యర్‌ని వెళ్ళనివ్వడని నేను భావిస్తున్నాను": ఆకాష్ చోప్రా

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 04, 2024
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) రిటెన్షన్ విధానంపై స్పష్టత ఇచ్చింది. రైట్ టు మ్యాచ్‌తో సహా మొత్తం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతించింది. దీంతో అన్ని జట్లు తమ ప్రధాన ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ జట్టు ఛాంపియన్‌గా నిలిపాడు.అతనిని రిటైన్ చేయడం ఖాయమని భావిస్తున్నారు, కానీ అతను రూ. 18 కోట్ల కేటగిరీలోనే కొనసాగుతాడా లేదా అనేది చూడాలి. కేకేఆర్ మూడో ఐపీఎల్ టైటిల్ సాధించడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. అప్పటి మెంటార్ గౌతమ్ గంభీర్‌తో కలిసి శ్రేయస్ విజేతగా నిలిచాడు. శ్రేయస్‌ను రిటెన్ చేయడం గురించి మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా స్పందించాడు.

వివరాలు 

 షారుక్ ఖాన్ శ్రేయస్‌ను వదులుకోడానికి సిద్ధంగా ఉండడు: ఆకాశ్ 

చోప్రా ప్రకారం, "కేకేఆర్‌కి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్. అతడిని మొదటి ఆటగాడిగా రిటైన్ చేయాల్సిందే. రూ.18 కోట్లు కోల్పోయినా, అతను కేకేఆర్‌కు విజయవంతమైన కెప్టెన్. గౌతమ్ గంభీర్‌ జట్టులో లేడు కాబట్టి, శ్రేయస్‌తోనే కొనసాగాలి. రైట్‌ టు మ్యాచ్ ద్వారా రూ. 18 కోట్లు పొందవచ్చు కానీ కెప్టెన్సీలో అలా చేయకూడదు. క్రికెట్ ఆడేది మనుషులే. వాళ్లకు భావోద్వేగాలు ఉంటాయి. ఈ విషయంలో షారుక్ ఖాన్ శ్రేయస్‌ను వదులుకోడానికి సిద్ధంగా ఉండడు" అని తెలిపారు.

వివరాలు 

వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్‌లను రిటైన్ చేయకపోవచ్చు: ఆకాశ్ చోప్రా

శ్రేయస్ తరువాత కేకేఆర్ మరో భారత ఆటగాడిని రిటైన్ చేయాలంటే, రింకు సింగ్ ఉత్తమ ఎంపిక అని అంటున్నారు. రింకు మార్కెట్‌లో కనీసం రూ. 14 కోట్లు సాధిస్తాడు, అందుకే అతన్ని రిటైన్ చేయడం ఖాయం. సీనియర్ ఆటగాళ్లు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ కూడా జట్టులో కొనసాగుతారు. అయితే వీరిలో ఎవరికెంత చెల్లిస్తారు అనేది ముఖ్యమైనది. ఒకరికి రూ. 11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది, మరొకరికి రూ. 18 కోట్లు అవసరం అవుతాయి. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ హర్షిత్ రాణాను రిటైన్ చేయడమే బెటర్ అని భావిస్తున్నారు, అతనికి కనీసం రూ. 4 కోట్లు దక్కుతాయి. ఇక వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్‌లను రిటైన్ చేయకపోవచ్చని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు.