Afghanistan Team : సెమీస్ రేసులో ఆఫ్ఘనిస్తాన్.. ఇలా జరిగితే పక్కా అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
పసికూనగా వన్డే వరల్డ్ కప్ 2023 బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు, సంచలన విజయాలను నమోదు చేస్తోంది.
ఇప్పటివరకూ ఆరు మ్యాచులు ఆడి మూడింట్లో ఆఫ్ఘాన్ గెలుపొందింది. భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన అఫ్గాన్, ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకలను ఓడించింది.
క్రికెట్లో అభిమానుల్లో అనేక మంది ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరాలని కోరుకుంటున్నారు.
ఈ జట్టు సెమీస్‌లో నిలిచేందుకు అవకాశాలు ఉన్నాయో లేవో ఓసారి పరిశీలిద్దాం.
ఆఫ్ఘనిస్తాన్ 12 పాయింట్లు సాధిస్తేనే సెమీస్ బెర్తు కన్ఫామ్ అవుతుంది.
ప్రస్తుతం ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇంకా ఆఫ్ఘాన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది.
Details
మిగిలిన మూడు మ్యాచుల్లో ఆఫ్ఘాన్ నెగ్గాలి
మిగిలిన మూడు మ్యాచుల్లో ఆఫ్ఘాన్ గెలవడంతో పాటు ఆస్ట్రేలియా కన్నా మెరుగైన రన్ రేట్ సాధించాల్సి ఉంటుంది.
అలాగే ఆస్ట్రేలియా ఆడే మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలిచినా ఆఫ్ఘాన్‌కు సెమీస్ అవకాశాలు ఉంటాయి.
ఇక ఆప్ఘాన్ 3 మ్యాచుల్లో ఒకదాంట్లో ఓడితే, ఆసీస్, న్యూజిలాండ్ మిగిలిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోవాలి.
ఒకవేళ సౌతాఫ్రికా మిగిలిన మూడు మ్యాచుల్లోనూ ఓడితే ఆఫ్ఘాన్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.