Champions Trophy: అఫ్గాన్ సెమీస్ టికెట్.. ఇంగ్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడితేనే అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్-బి నుంచి సెమీఫైనల్స్‌కు ఏ జట్లు ప్రవేశిస్తాయనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.
గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాయి.
ప్రస్తుతం నెట్ రన్ రేట్ ఆధారంగా న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
ఇక భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. మార్చి 2న జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో గెలిచే జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకోనుంది.
Details
పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో అప్ఘాన్
ఇక ఇంగ్లండ్ జట్టుపై అఫ్గానిస్థాన్ అద్భుత విజయాన్ని నమోదు చేయడంతో గ్రూప్-బి సెమీఫైనలిస్ట్ జట్ల విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.
ఈ విజయంతో అఫ్గానిస్థాన్ జట్టు టోర్నీలో రెండు మ్యాచ్‌లలో ఒక గెలుపుతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అయితే ఇంగ్లండ్ మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి చివరి స్థానంలో నిలిచింది.
అఫ్గానిస్థాన్ సెమీఫైనల్స్‌కు చేరాలంటే శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. అయినా అఫ్గాన్ జట్టు నేరుగా సెమీస్‌కు అర్హత పొందదు.
శనివారం దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధిస్తే అఫ్గాన్ జట్టు సెమీఫైనల్స్‌కు ప్రవేశించనుంది.
Details
రేపు ఆస్ట్రేలియాతో తలపడనున్న అప్ఘాన్
ప్రస్తుతం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు మూడు పాయింట్లతో గ్రూప్-బి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
శుక్రవారం అఫ్గానిస్థాన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే అది నేరుగా సెమీఫైనల్స్‌కు చేరుకోనుంది.
అఫ్గాన్ జట్టు సెమీ అవకాశాలను కోల్పోతుంది. తర్వాత శనివారం జరిగే దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచినా దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరుతుంది.
ఒకవేళ అఫ్గాన్ జట్టుపై ఆస్ట్రేలియా ఓడిపోయి, దక్షిణాఫ్రికా కూడా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతే, రన్ రేట్ ఆధారంగా దక్షిణాఫ్రికా సెమీఫైనల్స్‌కు వెళ్తుంది.
అప్పుడు గ్రూప్-బి నుంచి అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.