Page Loader
Shahid Afridi: పహల్గామ్ ఉగ్రదాడిపై అఫ్రిది కీలక వ్యాఖ్యలు.. మండిపడుతున్న భారతీయులు
పహల్గామ్ ఉగ్రదాడిపై అఫ్రిది కీలక వ్యాఖ్యలు.. మండిపడుతున్న భారతీయులు

Shahid Afridi: పహల్గామ్ ఉగ్రదాడిపై అఫ్రిది కీలక వ్యాఖ్యలు.. మండిపడుతున్న భారతీయులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 28, 2025
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడి లో 28 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ పై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. అటు సమయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పహల్గామ్ దాడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆగ్రహం రేపుతున్నాయి. ఉగ్ర దాడిని ఖండించేందుకు బదులుగా, అఫ్రిది భారతదేశం ఆధారాలు చూపాలని కోరాడు. వైరల్ అయిన ఓ వీడియోలో అఫ్రిది పాకిస్తాన్‌ను నిందించడానికి బదులుగా భారతదేశాన్ని విమర్శించాడు. అఫ్రిది, పాకిస్తాన్‌పై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, ఎలాంటి దర్యాప్తు లేకుండా పాకిస్తాన్‌ను తొందరపడి నిందించడం సరైనదిగా చెప్పాడు.

Details

క్రికెట్, క్రీడా దౌత్యంపై తన గంభీర విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, రాజకీయాలు ఈ విషయంలో ఉండకూడదని వ్యాఖ్యానించాడు. పొరుగు దేశాలు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. కానీ ఈ ఘటన జరిగిన వెంటనే పాకిస్తాన్ ను నిందించడం సరికాదని, కనీసం ఆధారాలు ఉన్నప్పుడే ఆరోపణలు చేయాలని సూచించాడు. అఫ్రిది వ్యాఖ్యలపై భారతీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ కఠిన చర్యలు తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా దౌత్య దాడి ప్రారంభించింది. పాకిస్తాన్‌తో ఐసీసీ ఈవెంట్‌లలో ఆడకూడదని బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంటోంది.