Virat Kohli: టీమిండియా బాడ్ న్యూస్.. చివరి 3 టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15, గురువారం ప్రారంభమవుతుంది. చివరి మూడు టెస్టుల కోసం భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. గురువారం (ఫిబ్రవరి 8) ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన కథనం ప్రకారం, వ్యక్తిగత కారణాల వల్ల మొదటి రెండు టెస్టులకు దూరమైన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడో టెస్టుకు కూడా దూరమవుతాడని తెలుస్తోంది. మాజీ భారత కెప్టెన్ బుధవారం సాయంత్రం వరకు తాను జట్టుకు ఎప్పుడు అందుబాటులో ఉంటాననే విషయంపై బీసీసీఐకి తెలియజేయలేదు.
మూడో టెస్టుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా..దూరం?
ఇంగ్లండ్‌తో జరిగే మిగిలిన మూడు టెస్టులకు జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలెక్టర్లు గురువారం వర్చువల్‌గా సమావేశమవుతారని,అందులో కోహ్లీ లేని జట్టును ఎంపిక చేస్తారని అర్థమవుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల కోసం కోహ్లి భారత టెస్ట్ జట్టులో ఎంపిక అయ్యాడు. అయితే హైదరాబాద్‌లో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి మూడు రోజుల ముందు,అతను వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగాడు. ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్టులో పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. గాయపడిన కేఎల్ రాహుల్,రవీంద్ర జడేజాలు మూడో టెస్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.