Page Loader
Ashes 2023 : హాఫ్ సెంచరీతో మెరిసిన మార్నస్ లాబుస్‌చాగ్నే
51 పరుగులు చేసిన మార్నస్ లాబుస్‌చాగ్నే

Ashes 2023 : హాఫ్ సెంచరీతో మెరిసిన మార్నస్ లాబుస్‌చాగ్నే

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2023
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

మాంచెస్టర్ లో బుధవారం ప్రారంభమైన యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లాబుస్‌చాగ్నే హాఫ్ సెంచరీతో రాణించాడు. 115 బంతుల్లో 51 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. దీంతో టెస్టు ఫార్మాట్లో 16 అర్ధ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే ఉస్మాన్ ఖవాజా(3) వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో డేవిడ్ వార్నర్ తో కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన మార్నస్ లాబుస్ చాగ్నే ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ కలిసి 46 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వార్నర్ (32) ఔట్ కావడంతో, స్టీవ్ స్మిత్ కలిసి లబుస్‌చాగ్నే 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Details

ఇంగ్లండ్ పై ఏడు హాఫ్ సెంచరీలు చేసిన మార్నస్ లాబుస్‌చాగ్నే

మార్నస్ లబుస్‌చాగ్నే 42 టెస్టులో 53.76 సగటుతో 3676 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలను బాదాడు. ఇంగ్లండ్‌పై 13 టెస్టు మ్యాచులు ఆడిన అతను 40.13 సగటుతో 883 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఏడు అర్ధసెంచరీలున్నాయి. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులను చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్‌వోక్స్ 4 వికెట్లతో చెలరేగగా, స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు పడగొట్టాడు.