Page Loader
Inter University Games: మహిళా కబడ్డీ ఆటగాళ్లపై దాడి.. క్షేమంగా ఉన్నారని ప్రకటించిన ఉపముఖ్యమంత్రి
మహిళా కబడ్డీ ఆటగాళ్లపై దాడి.. క్షేమంగా ఉన్నారని ప్రకటించిన ఉపముఖ్యమంత్రి

Inter University Games: మహిళా కబడ్డీ ఆటగాళ్లపై దాడి.. క్షేమంగా ఉన్నారని ప్రకటించిన ఉపముఖ్యమంత్రి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్‌లో జరిగిన అంతర్-విశ్వవిద్యాలయ కబడ్డీ ఛాంపియన్‌షిప్ సందర్భంగా తమిళనాడు మహిళా కబడ్డీ క్రీడాకారిణులపై జరిగిన దాడి క్రీడా ప్రపంచంలో కలకలం రేపింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన క్రీడా మైదానాల్లో చోటు చేసుకునే అనూహ్య ఘటనల్లో ఒకటిగా మారింది. ఈ గొడవకు కారణం, మ్యాచ్‌ రెఫరీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయంగా తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన మదర్ థెరిసా విశ్వవిద్యాలయం, పెరియార్ విశ్వవిద్యాలయం, అలగప్ప విశ్వవిద్యాలయం, భారతియార్ విశ్వవిద్యాలయాల మహిళా కబడ్డీ జట్లు పంజాబ్‌లో నిర్వహించిన ఉత్తర మండలం అంతర్-విశ్వవిద్యాలయ, అఖిల భారత అంతర్-విశ్వవిద్యాలయ కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2024-25లో పాల్గొన్నారు. ఈ టోర్నీలో దర్భంగ విశ్వవిద్యాలయం జట్టుతో మదర్ థెరిసా జట్టు మధ్య మ్యాచ్ జరుగుతుండగా, ఫౌల్ అటాక్ కారణంగా వాదనలు మొదలయ్యాయి.

Details

త్వరలోనే క్రీడాకారులు తమిళనాడుకు చేరుకుంటారు

ఫౌల్ అటాక్‌ను ఫిర్యాదు చేసినప్పుడు, రెఫరీ తీసుకున్న నిర్ణయం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. రెండు జట్లు ఒకదానిపై ఒకటి దాడి చేయడం ప్రారంభించగా, ఘర్షణ అదుపు తప్పింది. ఈ ఘటనలో క్రీడాకారిణులు, కొందరు ఇతర వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో క్రీడామైదానంలో కుర్చీలను విసరడం, వాగ్వాదం, తోపులాట స్పష్టంగా కనిపించింది. ఈ ఘర్షణలో పాల్గొన్న వ్యక్తులు అధికారులా లేదా ప్రేక్షకులా అన్నది తెలియలేదు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ ఘటనపై స్పందించారు. క్రీడాకారిణులందరూ సురక్షితంగా ఉన్నారని, తక్షణమే తమిళనాడు క్రీడా అభివృద్ధి సంస్థ, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో సంప్రదించి, వారి భద్రతను పర్యవేక్షించామని చెప్పారు. క్రీడాకారిణులు త్వరలో దిల్లీ నుంచి తమిళనాడుకు చేరుకుంటారని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్లారిటీ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్