AUS Vs PAK : ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య రేపే బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిదో!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగాలో 18వ మ్యాచులో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఆసక్తికర పోరు మొదలు కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం ఈ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో వన్ ఆఫ్ ది ఫెవరేట్ టీమ్‌గా పాకిస్థాన్ అడుగుపెట్టింది. మొదటి రెండు మ్యాచుల్లో విజయాలు అందుకున్న తర్వాత, అహ్మదాబాద్‌లో టీమిండియా తో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో పాక్ ఓడిపోయింది. ఈసారి ఎలాగైనా ఆసీస్ పై గెలవాలని పాక్ గట్టి పట్టుదలతో ఉంది. మొదటి రెండు మ్యాచులో ఓడిన ఆస్ట్రేలియా, శ్రీలంకతో జరిగిన మ్యాచులో బోణీ కొట్టింది. ఈ రెండు జట్లు మధ్య ఆట ఉత్కంఠంగా సాగే అవకాశముందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
పాకిస్థాన్ పై ఆసీస్ దే పైచేయి
చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండనుంది. ఇప్పటివరకూ ఇరు జట్లు వన్డేల్లో 107 సార్లు తలపడ్డాయి. ఆసీస్ 69 మ్యాచుల్లో విజయం సాధించగా, పాక్ 34 మ్యాచుల్లో నెగ్గింది. వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌పై పాకిస్థాన్ నాలుగు విజయాలు, ఆరు ఓటములు కలిగి ఉంది. పాకిస్థాన్ జట్టు అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్ (సి), మహ్మద్ రిజ్వాన్ (డబ్ల్యూకే), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్. ఆస్ట్రేలియా జట్టు మిచెల్ మార్ష్, వార్నర్, స్మిత్, లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్ (WK), మాక్స్‌వెల్, స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (సి), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.