Page Loader
IND Vs AUS : దంచికొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లు.. టీమిండియా ముందు భారీ టార్గెట్
96 పరుగుల వద్ద ఔట్ అయిన మిచెల్ మార్ష్

IND Vs AUS : దంచికొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2023
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు విజృంభించారు. రాజ్‌కోట్‌లో జరుగుతున్న ఈ మ్యాచులో తొలుత టాస్ ఓడిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (56), స్టీవన్ స్మిత్(74), లబుషన్ 72 పరుగులతో రాణించారు. 13 ఫోర్లు, 3 సిక్సులతో విరుచకపడ్డ మిచెల్ మార్ష్ 96 పరుగుల వద్ద కుల్దీప్ బౌలింగ్‌లో ఔట్ అయి, త్రుటీలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ల దెబ్బకు టీమిండియా పేసర్ బుమ్రా 10 ఓవర్లలో ఏకంగా 81 పరుగులను సమర్పించుకున్నాడు. భారత్ బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ చెరో ఒక వికెట్ తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా