యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు : తొలి రోజు రసవత్తరంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్
యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా మంచి స్కోరును సాధించింది. మాంచెస్టర్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. బౌలింగ్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు ఫర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా జట్టు కూడా బ్యాటింగ్‌లో సమిష్టిగా రాణించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ 32, ఉస్మాన్ ఖవాజా 3, లబుషన్ 51, స్మిత్ 41, ట్రావిస్ హెడ్ 48, మార్ష్ 51, కామరూన్ గ్రీన్ 16, అలెక్స్ క్యారీ 20 పరుగులు చేశారు.
4 వికెట్లు పడగొట్టిన క్రీస్ వోక్స్
ఇంగ్లండ్ బౌలర్లలో క్రీస్ వోక్స్ 19 ఓవర్లలో 52 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎక్కువ పరుగులు చేయకుండా క్రీస్ వోక్స్ కట్టడి చేశారు. ఇక స్టువర్ట్ బ్రాడ్ రెండు, మార్క్ వుడ్, మెయిల్ అలీ తలా ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో మిచెల్ స్టార్క్ (23), కెప్టెన్ పాట్ కమిన్స్ (1) ఉన్నారు. ఈ యాషెస్ సిరీస్‌లో 2-1తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది. ఈ నాలుగో యాషెస్ టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.