Page Loader
ICC Champions Trophy: నేడు ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మ‌రో ఆస‌క్తిక‌ర పోరు! సెమీ-ఫైనల్ లక్ష్యంగా కివీస్ 
నేడు ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మ‌రో ఆస‌క్తిక‌ర పోరు! సెమీ-ఫైనల్ లక్ష్యంగా కివీస్

ICC Champions Trophy: నేడు ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మ‌రో ఆస‌క్తిక‌ర పోరు! సెమీ-ఫైనల్ లక్ష్యంగా కివీస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

నేడు (సోమవారం) ఛాంపియన్స్ ట్రోఫీలో మరో ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది, ఇందులో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తలపడతాయి. ఈ మ్యాచ్ ఫలితంపై పాకిస్తాన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. న్యూజిలాండ్ విజయం సాధిస్తే, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బంగ్లాదేశ్‌తో పాటు పాకిస్తాన్ కూడా నిష్క్రమించాల్సి వస్తుంది. అదే సమయంలో, న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. ఇప్పటికే గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచిన భారత్, సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. సెమీస్ ఆశలు సజీవం... బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌ను ఓడిస్తే, పాకిస్తాన్‌కు సెమీఫైనల్ అవకాశాలు ఇంకా బతికే ఉంటాయి. అయితే, ఆ తరువాత న్యూజిలాండ్ టీమిండియాతో కూడా ఓడిపోవాలి. ఇక, ఈ రెండు మ్యాచుల్లోనూ న్యూజిలాండ్ భారీ తేడాతో పరాజయం పాలైతే మాత్రమే పాకిస్తాన్ సెమీఫైనల్ అవకాశాలను నిలబెట్టుకోగలదు.

వివరాలు 

తేలిక కాదు... 

ప్రస్తుత ఫామ్‌ను పరిశీలిస్తే,బంగ్లాదేశ్‌కు న్యూజిలాండ్‌ను ఓడించడం అంత సులభం కాదు. తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్,ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌ను 60పరుగుల తేడాతో చిత్తు చేసింది. విల్ యంగ్, టామ్ లాథమ్ లు శతకాలతో మెరిశారు,అలాగే గ్లెన్ ఫిలిప్స్ తన సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. జట్టులో ఏడో స్థానం వరకు హిట్టర్లున్నారు. బౌలింగ్ విభాగంలో మాట్ హెన్సీ,కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కీలకంగా నిలవనున్నారు. టీమిండియా చేతిలో... మరోవైపు, బంగ్లాదేశ్ జట్టు అనిశ్చితత్వానికి మరో నిదర్శనంగా మారింది.టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో 6వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్,బౌలింగ్ రెండింటిలోనూ పూర్తిగా విఫలమైంది. ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కేవలం 228 పరుగులు మాత్రమే చేసింది.

వివరాలు 

గత ఛాంపియన్స్ ట్రోఫీలో... 

భారత ఫీల్డింగ్ లోపాల కారణంగా ఈ స్కోరు సాధ్యమైంది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందంటే అతిశయోక్తి కాదు. అలాగే, బౌలర్లు భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. తొలి మ్యాచ్‌లో ఎదురైన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని, నేటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌కు ఎంతవరకు పోటీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ జయమే ఇప్పుడు బంగ్లాదేశ్‌కు మానసిక బలాన్ని ఇవ్వగలదు.