బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన ఆశిష్ నెహ్రా.. టీమిండియా కోచ్ ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా (Team India) కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) రెండేళ్ల పదవీకాలం వరల్డ్ కప్ 2023 ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే.
అయితే భారత్ కోచ్‌గా మరోసారి కొనసాగాలని బీసీసీఐ ద్రావిడ్‌ను సంప్రదించింది.
అయితే ద్రావిడ్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో బీసీసీఐ పెద్దలు ప్రత్యామ్నాయాన్ని వెతికే పనిలో పడ్డారు.
ఇప్పటికే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది.
ఈ క్రమంలో ఫుల్ టైమ్ కోచ్ వేటలో బీసీసీఐ నిమగ్నమైంది.
Details
హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్
ఈ నేపథ్యంలో బీసీసీఐ పెద్దలు టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాను కలిసినట్లు తెలిసింది.
భారత జట్టు కోచింగ్ బాధ్యతలను స్వీకరించాలని అశిష్ నెహ్రాను అహ్వానించారు.
ఈ ప్రతిపాదనను నెహ్రా కూడా తిరస్కరించినట్లు తెలిసింది. ఐపీఎల్ కమిట్‌మెంట్ల కారణంగా ఈ పదవిని స్వీకరించలేనని నెహ్రా చెప్పినట్లు వినికిడి.
దీంతో మళ్లీ బీసీసీఐ (BCCI) ద్రావిడ్ ను సంప్రదించినట్లు సమాచారం.
ఒకవేళ ద్రవిడ్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఓకే చెబితే కోచింగ్ స్టాఫ్‌గా విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్), పరాస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), టి దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది.