Rohit - Virat: సీనియర్ల ఫామ్‌పై కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు.. ప్రపంచకప్ కాంబినేషన్‌పై ఫోకస్
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ముగిసింది. ఇక న్యూజిలాండ్‌తో సిరీస్ ప్రారంభమయ్యే వరకు టీమ్‌ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటను అభిమానులు చూడలేరు. అయితే విండీస్‌తో సిరీస్‌లో ఇద్దరు సీనియర్లు శతకాలు సాధించి.. తమ ఫామ్‌పై వస్తున్న అపోహలకు సమాధానం ఇచ్చారు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. ఆఖరి వన్డేలో కేఎల్ రాహుల్ కూడా శతకం సాధించి తన ఫామ్‌ను చాటుకున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో సీనియర్ ఆటగాళ్ల పాత్ర ఎంత కీలకం కానుందో ఈ ప్రదర్శనలే స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని టీమ్‌ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా వెల్లడించాడు.
వివరాలు
సూపర్ ఫామ్ లో రోహిత్, కోహ్లీ
''సీనియర్ల నుంచి అద్భుతమైన ఆట వచ్చింది. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ భాయ్ రెండు సెంచరీలు చేశాడు. మరోసారి 90కి పైగా పరుగులు సాధించాడు.
విరాట్ భాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేఎల్ రాహుల్‌కు మంచి అవకాశం వచ్చింది.
దాన్ని అతడు రెండు చేతులతో అందుకున్నాడు. జట్టు కోసం ఎక్కడైనా వచ్చి ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని రాహుల్ చెప్పకనే చెప్పాడు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలనని తన ఇన్నింగ్స్‌తో సమాధానం ఇచ్చాడు. వీరంతా ఫామ్‌లో ఉండటం భారత్‌కు పెద్ద సానుకూలాంశం'' అని గిల్ తెలిపాడు.
వివరాలు
ప్రయోగాలకు ఎక్కువ సమయం లేదు
2027 వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో జట్టు కూర్పుపై ప్రయోగాలు చేయడానికి ఎక్కువ సమయం లేదని శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు.
'వచ్చే ప్రపంచకప్ నాటికి మేం మరీ ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేం. ప్రయోగాలు చేయడానికి సరిపడినంత సమయం లేదనుకుంటా. ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ రాబోయే వన్డే సిరీస్‌ల్లోనూ ఆడతారు.
ప్రపంచకప్ బరిలోకి దిగే కాంబినేషన్‌పై కసరత్తు జరుగుతోంది. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం లేదు. అలాంటి అవసరం కూడా లేదని గిల్ స్పష్టం చేశాడు.
కాగా ఈ నెల మూడో వారం నుంచి టీమ్‌ఇండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు వన్డేలు, ఐదు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.