LOADING...
Rohit Sharma: రోహిత్ కొత్త లగ్జరీ కారుకి 3015 నంబర్‌..స్పెషల్ ఏంటంటే?
రోహిత్ కొత్త లగ్జరీ కారుకి 3015 నంబర్‌..స్పెషల్ ఏంటంటే?

Rohit Sharma: రోహిత్ కొత్త లగ్జరీ కారుకి 3015 నంబర్‌..స్పెషల్ ఏంటంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వన్డే జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తాజాగా తన గ్యారేజీలోకి ఓ విలాసవంతమైన కొత్త వాహనాన్ని చేర్చుకున్నాడు. లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గిని కంపెనీకి చెందిన ఉరుస్‌ మోడల్‌ను ఆయన కొనుగోలు చేశారు. ఈ కారుకు కేటాయించిన '3015' నంబర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ నంబర్‌ వెనుక ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తితో అభిమానులు ఆరా తీశారు. చివరికి వారు ఆ రహస్యాన్ని బయట పెట్టారు. రోహిత్‌ ఎంచుకున్న 3015 నంబర్‌లోని అంకెలను కలిపితే (3+0+1+5) మొత్తం 9 వస్తుంది. అదేవిధంగా 30+15 చేస్తే 45 అవుతుంది, ఇది రోహిత్‌ శర్మ వన్డే క్రికెట్‌లో ధరించే జెర్సీ నంబర్‌ కూడా.

వివరాలు 

పాత కారు నంబర్ 264

ఇక్కడ మరో స్పెషల్ ఉందండోయ్.. . రోహిత్‌ కుమార్తె సమైరా జన్మదినం డిసెంబర్‌ 30న, కుమారుడు అహాన్‌ పుట్టినరోజు నవంబర్‌ 15. అందుకే, ఈ నంబర్‌ను తన కారు కోసం ఎంచుకున్నాడని అభిమానులు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు ఆయన వాడిన కారు నంబర్‌ '264' కాగా, ఇది వన్డేల్లో రోహిత్‌ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఈ లంబోర్గిని ఉరుస్‌ ధర సుమారు రూ.4.57 కోట్లుగా సమాచారం.

వివరాలు 

ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆడతాడా? 

చివరిసారిగా రోహిత్‌ శర్మ భారత్‌ తరఫున ఛాంపియన్స్‌ ట్రోఫీలో బరిలోకి దిగాడు. రెండు నెలల తర్వాత జరగబోయే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఆయన ఆడతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్‌, వన్డే క్రికెట్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఆయనకు మేనేజ్‌మెంట్‌ దేశవాళీ క్రికెట్‌లో కూడా ఆడాలని సూచించింది. ఈ నేపథ్యంలో రోహిత్‌ తీసుకునే నిర్ణయం ఏదన్నది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.