Page Loader
Mohammed Siraj: డీఎస్పీగా టీమిండియా క్రికెటర్ బాధ్యతలు స్వీకరణ
డీఎస్పీగా టీమిండియా క్రికెటర్ బాధ్యతలు స్వీకరణ

Mohammed Siraj: డీఎస్పీగా టీమిండియా క్రికెటర్ బాధ్యతలు స్వీకరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా తన బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం, తెలంగాణ డీజీపీకి రిపోర్ట్ చేసిన అనంతరం, సిరాజ్ అధికారికంగా డీఎస్పీగా నియమితులయ్యారు. గతంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరాజ్‌కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు, ఆ ప్రకారం ఇప్పుడు సిరాజ్ తన కొత్త పాత్రను స్వీకరించారు.

వివరాలు 

టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా సిరాజ్

ఇటీవల టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన స్టార్ బౌలర్ సిరాజ్ కూడా ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నారు. అనంతరం, హైదరాబాద్‌కు వచ్చిన సిరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా, సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవం తెచ్చిన మహ్మద్ సిరాజ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ నేపథ్యంలో, సిరాజ్‌కు ఇంటి స్థలం,ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది, ప్రస్తుతం ఈ హామీలను నెరవేర్చారు.