
టెస్టుల్లో సెహ్వాగ్ రికార్డును అధిగమించిన డేవిడ్ వార్నర్
ఈ వార్తాకథనం ఏంటి
బర్మింగ్ హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. 4వరోజు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ను ఆస్ట్రేలియా 273 పరుగులకు అలౌట్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా విజయానికి 281 పరుగులు అవసరమయ్యాయి.
ఈ క్రమంలో నాలుగు రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్ వార్నర్, మార్నర్ లాబుస్ చాగ్నే, స్టీవెన్ స్మిత్ నిరాశపరిచారు.
ప్రస్తుతం ఇంగ్లండ్ విజయానికి 7 వికెట్లు, ఆస్ట్రేలియా విజయానికి 174 పరుగులు కావాలి. ఈ టెస్టు మ్యాచులో నిరాశ పరిచిన డేవిడ్ వార్నర్ టెస్టుల్లో అరుదైన రికార్డును క్రియేట్ చేశారు.
Details
స్టువార్ట్ బ్రాడ్ చేతిలో 15సార్లు ఔట్ అయిన డేవిడ్ వార్నర్
మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులకే వెనుతిరిగిన వార్నర్, రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులు చేశాడు. దీంతో టెస్టుల్లో ఓపెనర్‌గా భారత మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ (8,207) రికార్డును వార్నర్ అధిగమించాడు. వార్నర్ 8,208 పరుగులు చేసి ఐదో స్థానంలో నిలిచాడు.
టెస్టుల్లో ఓపెనర్ గా పరుగుల పరంగా అలిస్టర్ కుక్ (11,845), సునీల్ గవాస్కర్ (9,607), గ్రేమ్ స్మిత్ (9,030), మాథ్యూ హేడెన్ (8,625) తర్వాత వార్నర్ ఉన్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో, వార్నర్ స్టువర్ట్ బ్రాడ్ చేతిలో ఔట్ అయ్యాడు. టెస్టు క్రికెట్‌లో బ్రాడ్ వార్నర్‌ను అవుట్ చేయడం ఇది 15వ సారి కావడం గమానర్హం.