
ఝార్ఖండ్ ప్లేయర్‌కు ధోనీ హామీ.. స్టార్క్‌పై భారీ మొత్తం పెట్టడానికి కారణమిదే : గంభీర్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్(IPL) వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.3.6 కోట్లు వెచ్చించి రాబిన్ మింజ్‌ను సొంతం చేసుకుంది.
ఝార్ఖండ్‌కు చెందిన 21 ఏళ్ల కుర్రాడు రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రాగా, అతని కోసం గుజరాత్, చైన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీపడ్డాయి.
చివరికి రూ.3.6 కోట్లతో గుజరాత్ దక్కించుకుంది. ఈ క్రమంలో రాబిన్ తండ్రి ఫ్రాన్సిస్ మింజ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏ ఫ్రాంచైజీ రాబిన్ మింజ్ ను తీసుకోకపోతే సీఎస్కే తీసుకుంటుందని ఎంఎస్ ధోని (MS Dhoni) హామీ ఇచ్చారని మింజ్ పేర్కొన్నాడు.
ఇటీవల ఎయిర్ పోర్టులో ధోనిని కలిశానని, ఎవరూ తీసుకోవడానికి ముందుకు రాకపోతే తాము ఉన్నామని చెప్పినట్లు మింజ్ తెలిపాడు.
Details
మిచెల్ స్టార్క్ కీలక ఆటగాడు : గౌతమ్ గంభీర్
మరోవైపు ఐపీఎల్ మినీ వేలంలో మిచెల్ స్టార్క్(Mitchell Starc) ను రూ.24. 75 కోట్లు పెట్టి కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది.
దీనిపై ఆ జట్టు మెంటర్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) స్పందించారు.
మిచెల్ స్టార్క్ కీలక ఆటగాడని, అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.
డెత్ ఓవర్లలో రాణించగల ప్లేయర్ అని, అంతేకాకుండా బౌలింగ్ విభాగాన్ని నడిపించగలరని తెలియజేశారు.
తాము కాకపోతే వేరే ఫ్రాంచైజీ అయినా భారీ మొత్తం వెచ్చించి అతడిని సొంతం చేసుకొనేది అని గంభీర్ తెలియజేశారు.