Page Loader
Hardik Pandya : హార్దిక్ పాండ్యా కోసం ముంబై రూ.100 కోట్లు చెల్లించిందా..?
హార్దిక్ పాండ్యా కోసం ముంబై రూ.100 కోట్లు చెల్లించిందా..?

Hardik Pandya : హార్దిక్ పాండ్యా కోసం ముంబై రూ.100 కోట్లు చెల్లించిందా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2023
06:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ (IPL) 2024 ప్రారంభానికి ముందే ఆటగాళ్ల విషయంలో పెను సంచనాలు నమోదవుతున్నాయి. ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకు అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆ జట్టు తీసుకున్న నిర్ణయం ఐపీఎల్‌లో చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను తప్పించి అతని స్థానంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ను కెప్టెన్‌గా నియమించింది. అయితే గుజరాత్ టైటాన్స్ నుంచి హార్ధిక్ ముంబైకి మారడం వెనుక పెద్ద మొత్తంలో ట్రెండింగ్ జరిగిందనే టాక్ బయటికొచ్చింది. హార్దిక్ కోసం ముంబై జట్టు ఏకంగా రూ.100 కోట్లు వెచ్చించినట్లు జోరుగా వార్తలొచ్చాయి. @mufaddal_vohra అనే ట్విటర్ హ్యాండిల్‌లో దీనిపై ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ గా మారిన ట్వీట్