
MI vs DC Predicted Playing XI: ప్లేఆఫ్స్ కోసం డూ ఆర్ డై పోరు.. ముంబై-ఢిల్లీ జట్లలో కీలక మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్ కీలక దశలోకి ప్రవేశించింది. ప్లేఆఫ్స్ రేసులో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తమ స్థానాలను ఖచ్చితంగా నిర్ధారించుకున్నాయి.
ఇక నాలుగో స్థానాన్ని చేజిక్కించుకోవడానికి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఉత్కంఠభరిత పోటీ నెలకొంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.
ముంబయి ఇండియన్స్ ప్రస్తుతం 12 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్‌లలో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.
ముంబై జట్టు ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుతుంది. ఢిల్లీకి ఈ మ్యాచ్‌లో విజయం లభిస్తే, తమ ఆశలను కొనసాగించుకునే అవకాశం ఉంటుంది.
Details
ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ లైనప్
ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్) నమన్ ధీర్, కార్బిన్ బాష్ / మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ / అశ్వనీ కుమార్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా
ఢిల్లీ క్యాపిటల్స్ అంచనా జట్టు
కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ / సెదిఖుల్లా అటల్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, టీ నటరాజన్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, చమాన్
Details
హెడ్ టు హెడ్ రికార్డు
ఇప్పటివరకు ఈ రెండు జట్లు 36సార్లు తలపడ్డాయి. వాటిలో ముంబై ఇండియన్స్ 20 విజయాలు సాధించగా, ఢిల్లీ క్యాపిటల్స్ 16 గెలిచాయి.
ఈ సీజన్‌లో ఇది రెండోసారి తలపడటమయ్యింది. మొదటి మ్యాచ్లో ముంబై 12 పరుగుల తేడాతో గెలిచింది.
వాతావరణ పరిస్థితి
ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు ఉంది. ఆట ప్రారంభానికి ముందు వర్షం, ఉరుములు సంభవించవచ్చని అంచనా. అయితే టాస్ సమయానికి ఆకాశం నిర్మలంగా ఉండే సూచనలున్నాయి.
రాత్రివేళ భారీ వర్షాలు, తుఫాన్ వచ్చే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం 80 శాతం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.