Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యంపై వీడిన అనిశ్చితి.. దుబాయ్‌లో భారత్ మ్యాచ్‌లు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యంపై అనిశ్చితి తొలగిపోయిన విషయం తెలిసిందే. బీసీసీఐ సూచన మేరకు టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు పీసీబీ సుముఖత వ్యక్తం చేసింది. అయితే, పీసీబీ కోరినట్లుగా , 2024-27 మధ్య ఐసీసీ ఈవెంట్లలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లు భారత్ లేదా పాకిస్థాన్‌లో కాకుండా తటస్థ వేదికల్లో నిర్వహించనున్నారు. భద్రతా కారణాలను ఉటంకిస్తూ, పాక్‌లో టీమిండియా పర్యటించలేదని బీసీసీఐ స్పష్టమైన వైఖరి తెలియజేయడంతో పీసీబీ ఈ ఆమోదానికి వచ్చిందని తెలుస్తోంది.
దుబాయ్‌లో భారత్ మ్యాచ్‌లు
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే మ్యాచ్‌లకు దుబాయ్‌ను తటస్థ వేదికగా నిర్ణయించారు. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరగనున్నాయి. అయితే, భారత జట్టు ఫైనల్‌కు చేరుకోకపోతే, ఆ తుది పోరు లాహోర్‌లో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. భారత్, పాకిస్థాన్ మధ్య కీలక మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుందని, ఛాంపియన్స్ ట్రోఫీ తుది షెడ్యూల్‌ను ఐసీసీ త్వరలో ప్రకటించనున్నట్లు పీసీబీ ప్రతినిధి అమిర్ మీర్ వెల్లడించారు. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్, పాకిస్థాన్ జట్లు ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఆడడం లేదు. ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఈ రెండు జట్లు పరస్పరం తలపడుతున్నాయి.