LOADING...
Team India : షమీ చేతికి ముద్దు పెట్టిన అశ్విన్.. సోషల్ మీడియాలో వైరల్!
షమీ చేతికి ముద్దు పెట్టిని అశ్విన్.. సోషల్ మీడియాలో వైరల్!

Team India : షమీ చేతికి ముద్దు పెట్టిన అశ్విన్.. సోషల్ మీడియాలో వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2023
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023 మొదటి సెమీ-ఫైనల్‌లో మహ్మద్ షమీ ఏడు వికెట్టు పడగొట్టి భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. న్యూజిలాండ్‌పై అద్భుత ప్రదర్శనతో షమీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. షమీ వీరోచిత ప్రదర్శన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వచ్చినప్పుడు అశ్విన్ షమీని పొగడ్తలతో ముంచెత్తాడు. అనంతరం అతని చేతిపై ముద్దు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, విరాట్ కోహ్లీని కౌగిలించుకున్నాడు. యుజేంద్ర చాహల్ కూడా డ్రెస్సింగ్ రూమ్ లోకి భారత ఆటగాళ్లను అభినందించాడు. న్యూజిలాండ్‌పై విజయం తర్వాత ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్, ఆటగాళ్లను అభినందించారు. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కౌగిలించుకున్న డ్రెస్సింగ్ రూమ్ వీడియోని బీసీసీఐ పోస్టు చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీసీసీఐ పోస్టు చేసిన వీడియో