Page Loader
Bhuvneshwar Kumar : ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్ చరమాంకంలో ఉన్నా : భువనేశ్వర కుమార్
ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్ చరమాంకంలో ఉన్నా : భువనేశ్వర కుమార్

Bhuvneshwar Kumar : ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్ చరమాంకంలో ఉన్నా : భువనేశ్వర కుమార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2023
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆసియా కప్ కు ప్రకటించిన 17 మంది ప్రాబబుల్స్ లోనే ప్రసిద్ధ్ కృష్ణ, తిలక్ వర్మలను తప్పించి మిగిలిన 15 మందిని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను బీసీసీఐ పక్కనపెట్టింది. దీంతో భువనేశ్వర్ కెరీర్ ముగిసినట్లేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో జాతీయ జట్టులో పునరాగమనం గురించి భువనేశ్వర్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్ బౌలర్‌గా తన కెరీర్ చివరి దశకు చేరుకుందని, ప్రస్తుతం తన దృష్టంంతా కేవలం ఆటను ఆస్వాదించడమే మీదనే ఉందని పేర్కొన్నారు.

Details

లీగ్ క్రికెట్ పై ఫోకస్ పెడతానన్న భువీ

టీమిండియాలో చోటు లేదన్న విషయం తనకు బాధించడం లేదని, రీఎంట్రీ ఇచ్చేందుకు తానేమీ గొప్ప ప్రయత్నాలు చేయడం లేదని, ఇంకొన్నాళ్లు పాటు నాణ్యమైన క్రికెట్ ఆడాలని ఉందని భువనేశ్వర్ కుమార్ చెప్పారు. ఏ ఫార్మాట్లో అయినా, ఎలాంటి లీగ్ ఆడుతున్న మెరుగైన ప్రదర్శనలు ఇవ్వడం మీదనే తన దృష్టి అంతా ఉందని, ఇకపై తాను లీగ్ క్రికెట్ పై మరింతగా ఫోకస్ పెడతానని వెల్లడించారు. భువనేశ్వర్ కుమార్ భారత్ తరుఫున 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20లు ఆడాడు. మొత్తం తన కెరీర్‌లో 294 వికెట్లను పడగొట్టాడు.