LOADING...
Duleep Trophy 2025: 'గల్లీ క్రికెట్‌ కూడా ప్రసారం.. దులీప్ ట్రోఫీకి ఎందుకు లైవ్ లేదు?' ఫ్యాన్స్ మండిపాటు
'గల్లీ క్రికెట్‌ కూడా ప్రసారం.. దులీప్ ట్రోఫీకి ఎందుకు లైవ్ లేదు?' ఫ్యాన్స్ మండిపాటు

Duleep Trophy 2025: 'గల్లీ క్రికెట్‌ కూడా ప్రసారం.. దులీప్ ట్రోఫీకి ఎందుకు లైవ్ లేదు?' ఫ్యాన్స్ మండిపాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవాళీ క్రికెట్‌ను మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్న బీసీసీఐ,నిజానికి ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించడంలో వెనుకబడింది. ఈ అంశానికి తాజా ఉదాహరణగా దులీప్ ట్రోఫీ నిలుస్తోంది.ప్రతి అంతర్జాతీయ క్రికెటర్ అందుబాటులో ఉన్నప్పుడు దేశవాళీ మ్యాచ్‌లు జరగాలని బీసీసీఐ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఫిట్‌నెస్‌లో ఉండడానికి,ఫామ్‌లోకి రాక కోసం సీనియర్‌ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటారు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్స్‌ జరుగుతున్నాయి, కానీ ఈ మ్యాచ్‌లకు లైవ్‌స్ట్రీమింగ్‌ లేకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ తర్వాత దాదాపు నెల రోజులపాటు విరామం వచ్చింది. ఫ్యాన్స్‌ ఈ టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.గురువారం నుంచి మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి,కానీ ప్రత్యక్ష ప్రసారం లేకపోవడం నెట్టింట విమర్శలకు దారితీసింది.

వివరాలు 

తొలి సెమీస్, రెండో సెమీస్‌ సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం

తొలి క్వార్టర్ ఫైనల్స్‌లో నార్త్‌ జోన్‌ - ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్‌ - నార్త్‌ఈస్ట్ జోన్ తలపడుతున్నాయి. గాయం కారణంగా దూరమైన మహ్మద్ షమీ తిరిగి ఫామ్‌ను పొందేందుకు ఈసారి సన్నద్ధం అయ్యాడు. అలాగే ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, రజత్ పటీదార్, దీపక్ చాహర్ వంటి స్టార్‌ క్రికెటర్లు మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. తొలి సెమీస్, రెండో సెమీస్‌ సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈక్రమంలో ఫ్యాన్స్‌ బీసీసీఐపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

బీసీసీఐపై ఫ్యాన్స్ విమర్శలు  

"బీసీసీఐకి ఇది సిగ్గు చేటు. క్వార్టర్ ఫైనల్స్‌ మ్యాచ్‌లను ప్రసారం చేయలేరా? ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు అని చెప్పడమే తప్ప.. దేశంలోనే ప్రీమియర్ డొమెస్టిక్‌ టోర్నీని టెలీకాస్ట్ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి?" "ప్రస్తుతంలో గల్లీ క్రికెట్‌ అయిన టెన్నిస్ బాల్‌ టోర్నీలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటే.. ఇంత సాంకేతికత ఉన్న బీసీసీఐ మాత్రం ప్రసారం చేయలేకపోతోంది. దేశవాళీ క్రికెట్ అభివృద్ధి చేయడమంటే ఇదేనా?''

వివరాలు 

బీసీసీఐపై ఫ్యాన్స్ విమర్శలు  

"దులీప్ ట్రోఫీ మ్యాచులు లైవ్‌ ఇవ్వడం లేదు. మన దేశ క్రికెటర్లు ఆడే టోర్నీని చూడలేకపోతే.. ఎందుకు నిర్వహించాలి? స్కోర్‌ బోర్డు కూడా సమయానికి అప్‌డేట్ కావడం లేదు.ధ్రువ్ జురెల్ టాస్‌కు వచ్చాడు, చివరికి ఫైనల్ XIలో లేడు. ఇంతటి చెత్త అనుభవం ఎప్పుడూ కలగలేదు'' "భారత క్రికెట్‌లో సూపర్‌స్టార్‌ సంప్రదాయం పోవాలని అందరూ చెబుతారు. దేశవాళీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఉపదేశాలు చేస్తారు. కానీ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వకపోతే.. దులీప్‌ ట్రోఫీ వంటి టోర్నీని ప్రత్యక్ష ప్రసారం చేయకపోతే ఇంకెందుకు?''