Page Loader
IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. టీమిండియా తుది జట్టు ఇదే!
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. టీమిండియా తుది జట్టు ఇదే!

IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. టీమిండియా తుది జట్టు ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2024
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టు సొంతగడ్డపై టెస్టు ఫార్మాట్‌లో విజయాల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌ను ఘనంగా ఓడించి, వరుసగా 18వ సిరీస్‌ను గెలుచుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ అక్టోబర్ 16న బెంగళూరులో ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు అర్హత సాధించాలంటే, టీమిండియాకు ఈ సిరీస్ విజయం కీలకంగా మారింది. అందుకే భారత జట్టు పటిష్ట జట్టుతో బరిలోకి దిగనుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ కొనసాగుతున్నారు. ఇటీవల ఆడిన మ్యాచ్‌ల్లో వీరిద్దరూ అద్భుత ప్రదర్శన చూపారు. న్యూజిలాండ్‌‌పై కూడా అదే తరహాలో ఆడతారన్న ఆశాభావం ఉంది. మూడో స్థానంలో శుభ్‌మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు.

Details

ధ్రువ్ జురెల్ కు నో ఛాన్స్

కొంతకాలంగా విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌కు దూరంగా ఉన్నా, ఇప్పుడు పెద్ద స్కోర్ చేయాలని తహతహలాడుతున్నాడు. కేఎల్ రాహుల్ జట్టులో కొనసాగనున్న నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్‌కు తుది జట్టులో అవకాశం దక్కడం కష్టమే. ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ చేసినప్పటికీ, మేనేజ్‌మెంట్ రాహుల్‌పై ఇంకా నమ్మకం ఉంచింది. ప్రధాన వికెట్‌ కీపర్‌గా రిషబ్ పంత్ ఆడతాడు. దీంతో ధ్రువ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నారు. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ముగ్గురూ జట్టులో ఉండే అవకాశాలున్నాయి. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ కీలకంగా మారనున్నారు. బంగ్లాదేశ్‌పై మంచి ప్రదర్శన చేసిన ఆకాశ్ దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశాల కోసం ఇంకా ఎదురుచూస్తున్నాడు.

Details

తొలి టెస్టుకు భారత్ తుది జట్టు (అంచనా) 

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.