Page Loader
IND vs ENG: క్లీన్‌స్వీప్‌పై దృష్టి.. మూడో వన్డేలో భారత్ తుది జట్టులో 4 మార్పులు
క్లీన్‌స్వీప్‌పై దృష్టి.. మూడో వన్డేలో భారత్ తుది జట్టులో 4 మార్పులు

IND vs ENG: క్లీన్‌స్వీప్‌పై దృష్టి.. మూడో వన్డేలో భారత్ తుది జట్టులో 4 మార్పులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 11, 2025
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత జట్టు, మూడో వన్డేలో కూడా గెలిచి మరింత ఆత్మవిశ్వాసంతో ఛాంపియన్స్‌ ట్రోఫీకి సిద్ధమవ్వాలని భావిస్తోంది. అహ్మదాబాద్‌లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో కొన్ని మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు సిరీస్‌లో ఆడని వికెట్‌కీపర్ రిషబ్ పంత్, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మొదటి వన్డేలో ఆడిన మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ అహ్మదాబాద్‌లో ఆడే అవకాశాలున్నాయి.

Details

మూడో వన్డేలో రిషబ్ పంత్ ఆడే ఛాన్స్

వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ స్థానాన్ని రిషబ్ పంత్ భర్తీ చేసే అవకాశం ఉండగా, షమి స్థానంలో అర్ష్‌దీప్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. తొలి రెండు వన్డేల్లో అద్భుతంగా రాణించిన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి ఇచ్చి, వారి స్థానాల్లో కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లను తీసుకునే అవకాశముంది. నాగ్‌పుర్ వన్డే ద్వారా అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్, మూడో వన్డేలో బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. స్టార్ బ్యాటర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. విరాట్ కోహ్లీ కూడా అహ్మదాబాద్ వన్డేలో మంచి ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. మోదీ స్టేడియంలో భారత్ చివరిసారిగా 2023నవంబర్ 19న వన్డే ఆడింది.

Details

భారత తుది జట్టు ఇదే

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడి, మూడోసారి విశ్వవిజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.