
IPL 2025: ఐపీఎల్ 2025లో సీజన్‌లో డేంజరస్ ప్లేయర్లు వీరే..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఐపీఎల్ వేదిక మరోసారి సిద్ధమవుతోంది
ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న ప్రారంభంకానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR),రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది.
ఐపీఎల్‌లో అత్యధికంగా 5 సార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మార్చి 23న చెపాక్ స్టేడియంలో పోటీ పడనున్నాయి.
ఇప్పుడు, ఐపీఎల్ 18వ సీజన్‌లో దుమ్మురేపే ఐదుగురు కీలక ఆటగాళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
వివరాలు
1. రిషబ్ పంత్
ఐపీఎల్ 2025లో అందరి దృష్టి ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, చురుకైన వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్‌పై ఉంటుంది.
మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్(LSG)జట్టు అతనిని రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇకపై అతను లక్నో జట్టు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కెప్టెన్సీతో పాటు, తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా అతనిపై ఉంది.
రిషబ్ పంత్ ఇప్పటి వరకు 111 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 35.31 సగటుతో 3284 పరుగులు చేశాడు.
ఇందులో 1 సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్ల వెనుక 75 క్యాచ్‌లు పట్టడంతో పాటు 23 స్టంపింగ్‌లు కూడా చేశాడు.
ఐపీఎల్ 2025లో అతను బ్యాట్‌తో తుఫాను సృష్టించే అవకాశం ఉంది.
వివరాలు
2. శ్రేయస్ అయ్యర్
ఈ సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతనిని రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది.
గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా నిలిపినప్పటికీ, ఈసారి కోల్‌కతా జట్టుతో అతని బంధం ముగిసింది.
ఇటీవల జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు టైటిల్ గెలుచుకునేందుకు శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు.
ఆ టోర్నమెంట్‌లో 5 మ్యాచ్‌ల్లో 48.60 సగటుతో 243 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025లో కూడా తన అద్భుత ప్రదర్శనను కొనసాగించేందుకు శ్రేయాస్ సిద్ధంగా ఉన్నాడు.
వివరాలు
3. పాట్ కమ్మిన్స్
ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విజేత కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టును నడిపించనున్నాడు.
గాయానికి గురై, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడలేకపోయినప్పటికీ, ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు.
పాట్ కమ్మిన్స్ ఓ సీనియర్ ఫాస్ట్ బౌలర్ మాత్రమే కాదు, ఒక తెలివైన నాయకుడూ. గత సీజన్‌లో అతని నాయకత్వంలో SRH ఫైనల్‌కు చేరుకుంది.
కానీ టైటిల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
గత ఐపీఎల్ సీజన్‌లో అతను 18 వికెట్లు పడగొట్టాడు. ఈసారి SRH జట్టును ఐపీఎల్ ఛాంపియన్‌గా మార్చే లక్ష్యంతో పాట్ కమ్మిన్స్ ఆడనున్నాడు.
వివరాలు
4. రచిన్ రవీంద్ర
ఎడమచేతి బ్యాట్స్‌మన్, నైపుణ్యం కలిగిన స్పిన్ బౌలర్ రచిన్ రవీంద్ర ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నాడు.
4 మ్యాచ్‌ల్లో 65.75 సగటుతో 263 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అతనిని రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది.
CSK తరఫున రచిన్ రవీంద్ర నంబర్-3 స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఈసారి తన ఆటతో ప్రత్యర్థి జట్లకు కంటిమీద కునుకు లేకుండా చేసే అవకాశం ఉంది.
వివరాలు
5. అజ్మతుల్లా ఉమర్జాయ్
ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన 24 ఏళ్ల సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఉమర్జాయ్ ఈ సీజన్‌లో అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.
అతను తుఫాన్ బ్యాటింగ్ చేయడమే కాకుండా, వేగంగా బంతిని సంధించగలడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ (PBKS) అతనిని రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున X-ఫ్యాక్టర్ ఆటగాడిగా అతను నిలిచే అవకాశముంది.
ఈ ఐదుగురు ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ 2025లో సంచలనాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏ జట్టు విజేతగా నిలుస్తుందో వేచి చూడాలి!