Page Loader
IPL 2025 auction:వేలంలో అమ్ముడైన,అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా ఇదే!

IPL 2025 auction:వేలంలో అమ్ముడైన,అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా ఇదే!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2024
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

2024 ఐపీఎల్ మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించబడిన సంగతి తెలిసిందే. ఈ వేలం మొదటి రోజే లీగ్ చరిత్రలో ఎప్పుడూ చూడని రీతిలో ఆటగాళ్లు భారీ ధరలకు కొనుగోలు అయ్యారు. భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రూ.27 కోట్ల ధరకు అమ్ముడై, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు, భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రూ.26.75 కోట్లకు, వెంకటేశ్ అయ్యర్ రూ.23.75 కోట్లకు అమ్ముడయ్యారు. టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టులో చేరాడు.

వివరాలు 

రూ.467.95 కోట్ల ఖర్చుతో కొనుగోలు

వేలం మొదటి రోజున మొత్తం 84 మంది ఆటగాళ్లను వేలం వేయగా, 10 ఫ్రాంచైజీలు 72 మంది ఆటగాళ్లను రూ.467.95 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేశాయి. అయితే, 12 మంది ఆటగాళ్లను ఎవరూ కొనుగోలు చేయలేదు. అందులో సీనియర్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలు ఉండడం గమనార్హం. కనీస ధర వద్ద కూడా వీరిని ఎవరూ కొనుగోలు చేయకపోవడం విశేషం. అదే విధంగా, దేవదత్ పడిక్కల్, యశ్ ధుల్, కార్తీక్ త్యాగీ, పియూష్ చావ్లా, శ్రేయస్ గోపాల్ వంటి పలువురు భారత ఆటగాళ్లు కూడా వేలంలో అమ్ముడుపోలేదు.

వివరాలు 

అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా

దేవదత్ పడిక్కల్, డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, వాకర్ సలామ్‌కేలీ, అన్‌మోల్ ప్రీత్ సింగ్, యశ్ ధుల్, ఉత్కర్ష్ సింగ్, ఉపేంద్ర యాదవ్, లువ్‌నిత్ సిసోడియా, కార్తీక్ త్యాగీ, పియూష్ చావ్లా, శ్రేయస్ గోపాల్