NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఆ సిరీస్‌కు ఇద్దరు స్టార్ ప్లేయర్లు రెడీ
    తదుపరి వార్తా కథనం
    టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఆ సిరీస్‌కు ఇద్దరు స్టార్ ప్లేయర్లు రెడీ
    వేగంగా కోలుకుంటున్న కేఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా

    టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఆ సిరీస్‌కు ఇద్దరు స్టార్ ప్లేయర్లు రెడీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 29, 2023
    10:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత జట్టులో పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఆసియా‌ కప్, వన్డే వరల్డ్ కప్ సిరీస్‌లు దగ్గరికి వస్తున్నాయి. తాజాగా ఇద్దరు కీలక ఆటగాళ్లు ఆసియా కప్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

    భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతోంది. అక్టోబర్-నవంబర్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రపంచ కప్ టూర్ కు ముందు టీమిండియా జట్టుకు కొన్ని సానుకూల వార్తలు వస్తున్నాయి.

    వన్డే వరల్డ్ కప్ ముందు భారత జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు కోలుకొనే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్న ఉన్న జస్ప్రిత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

    Details

    ఆసియా కప్ కు అందుబాటులో బుమ్రా

    జస్ప్రిత్ బుమ్రా, కేఎల్ రాహుల్ ఆసియా టోర్నీకి అందుబాటులో ఉండనున్నట్లు స్పష్టమవుతోంది.

    శ్రేయస్ అయ్యర్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజుశాంసన్, సూర్యకుమార్ యాదవ్‌లకు వన్డే ప్రపంచ కప్ లో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.

    గతేడాది మార్చిలో శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా, ప్రస్తుతం ఎన్‌సీఏలో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. వెస్టిండీస్ తర్వాత జరిగే ఐర్లాండ్ సిరీస్ పర్యటనకు అతను సిద్ధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

    కేఎల్ రాహుల్ తొడ నొప్పి కారణంగా ఐపీఎల్ 16వ సీజన్‌ నుంచి తప్పుకున్నాడు. తర్వాత శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం రాహుల్ కూడా ఎన్‌సీఏలో వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జస్పిత్ బుమ్రా
    శ్రేయస్ అయ్యర్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    జస్పిత్ బుమ్రా

    Bumrah is Back: యార్కర్ల కింగ్ బుమ్రా వచ్చేశాడు భారత జట్టు
    టీమిండియా షాక్.. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌‌కు బుమ్రా దూరం క్రికెట్
    మైదానంలోకి అడుగుపెట్టిన యార్కర్ల కింగ్ బుమ్రా టీమిండియా
    జస్ప్రీత్ బుమ్రాను తప్పించిన బీసీసీఐ..! క్రికెట్

    శ్రేయస్ అయ్యర్

    ఆసీస్‌తో తొలి టెస్టుకు శ్రేయాస్ దూరం క్రికెట్
    INDvsAUS : శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వేటు ఎవరిపై..? క్రికెట్
    టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. వన్డే సిరీస్‌కి శ్రేయాస్ అయ్యర్ దూరం..! క్రికెట్
    ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ దూరమైన శ్రేయాస్ అయ్యర్.. క్లారిటీ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025