LOADING...
KKR : వరుస విజయాలతో ఉత్సాహంలో కేకేఆర్.. ఇదే జోరు కొనసాగితే ప్లే ఆఫ్స్‌కు అవకాశం
వరుస విజయాలతో ఉత్సాహంలో కేకేఆర్.. ఇదే జోరు కొనసాగితే ప్లే ఆఫ్స్‌కు అవకాశం

KKR : వరుస విజయాలతో ఉత్సాహంలో కేకేఆర్.. ఇదే జోరు కొనసాగితే ప్లే ఆఫ్స్‌కు అవకాశం

వ్రాసిన వారు Moogati Shabari
May 09, 2026
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. ప్రారంభ ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన ఈ జట్టు.. తొలి గెలుపు తర్వాత పూర్తిగా మారిపోయింది. టోర్నీ మొదటి భాగంలో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన కేకేఆర్.. ఇప్పుడు ప్లే ఆఫ్స్ రేసులో బలమైన పోటీదారుగా కనిపిస్తోంది. వరుస విజయాలతో ఆ జట్టులో కొత్త ఉత్సాహం నెలకొంది. మొదట రాజస్థాన్‌పై విజయం సాధించిన కోల్‌కతా.. అనంతరం లక్నోతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సూపర్ ఓవర్ ద్వారా గెలుపొందింది. ఆ తర్వాత వరుసగా ఐదు విజయాలతో దూసుకెళ్తున్న సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ను వారి స్వగ్రౌండ్‌లోనే ఓడించి భారీ షాక్ ఇచ్చింది.

వివరాలు

ప్లే ఆఫ్స్‌కు అవకాశం..

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ను కూడా వారి హోం గ్రౌండ్‌లో చిత్తుగా ఓడించి వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయాలతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి. ఐపీఎల్‌లో 10 జట్లు పోటీపడుతున్న ఫార్మాట్‌లో 16 పాయింట్లు సాధించిన జట్టు సాధారణంగా నెట్‌రన్‌రేట్ అవసరం లేకుండానే ప్లే ఆఫ్స్ చేరిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం కోల్‌కతా 9 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇంకా ఆ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే మొత్తం పాయింట్లు 17కు చేరతాయి. అప్పుడు ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు

ఆ 4 మ్యాచులపై ఉత్కంఠ..

ఒకవేళ మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటిలో ఓడిపోయినా, 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ ఆశలను కొనసాగించవచ్చు. అయితే ఆ పరిస్థితిలో ఇతర జట్ల ఫలితాలు కూడా కీలకంగా మారతాయి. ఇక కేకేఆర్ మిగిలిన మ్యాచ్‌ల విషయానికి వస్తే.. ఇప్పటివరకు లీగ్ దశలో 10 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 13న రాయ్‌పుర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. అనంతరం మే 16న గుజరాత్ టైటాన్స్, మే 20న ముంబయి ఇండియన్స్, మే 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లు ఉన్నాయి.

Advertisement