LOADING...
Varun Chakravarthy:అగ్రస్థానం కోల్పోయిన మిస్టరీ బౌలర్.. టాప్‌లోకి రషీద్ ఖాన్
అగ్రస్థానం కోల్పోయిన మిస్టరీ బౌలర్..టాప్‌లోకి రషీద్ ఖాన్

Varun Chakravarthy:అగ్రస్థానం కోల్పోయిన మిస్టరీ బౌలర్.. టాప్‌లోకి రషీద్ ఖాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2026
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమ్ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తాజాగా తన టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు. ఈ టోర్నీలో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోవడంతో అతడు రెండో స్థానానికి జారిపోయాడు. అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 753 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం 740 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గత వారం 771 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న వరుణ్ ఈ వారం 31 పాయింట్లు కోల్పోయాడు. వరల్డ్‌కప్ విజయంతో మంచి ఉత్సాహంలో ఉన్న అతడికి ఈ మార్పు కొంత నిరాశ కలిగించే అంశంగా చెప్పవచ్చు.

వివరాలు 

టాప్ 5 బౌలర్లు

రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్) - 753 రేటింగ్స్ వరుణ్ చక్రవర్తి (భారత్) - 740 రేటింగ్స్ అబ్రార్ అహ్మద్ (పాకిస్థాన్) - 736 రేటింగ్స్ ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్) - 721 రేటింగ్స్ కర్బిన్ బోష్ (సౌతాఫ్రికా) - 704 రేటింగ్స్

వివరాలు 

ర్యాంకింగ్స్‌లో సంజు శాంసన్ మెరుగుదల

టీ20 వరల్డ్‌కప్‌లో హీరోగా నిలిచిన టీమ్ఇండియా యువ బ్యాటర్ సంజు శాంసన్ మరోసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' అవార్డును అందుకున్న అతడు తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 18 స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం 637 రేటింగ్ పాయింట్లతో 22వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై అర్ధశతకం సాధించిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని కొనసాగించగలిగాడు. అదే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ కూడా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు.

Advertisement

వివరాలు 

అభిషేక్ - ఇషాన్ మధ్య పోటీ

టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా యువ ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తాజా ర్యాంకింగ్స్‌లో 875 రేటింగ్ పాయింట్లతో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే 871 పాయింట్లతో ఇషాన్ కిషన్ అతడికి చాలా దగ్గరగా వచ్చాడు. కేవలం నాలుగు రేటింగ్ పాయింట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. ఇంకా భారత్‌కు వచ్చే రెండు నెలల వరకు టీ20 మ్యాచ్‌లు లేకపోవడంతో వీరి పాయింట్లలో మార్పు ఉండకపోవచ్చు. అయితే ఇదే సమయంలో ఇతర దేశాలు సిరీస్‌లు ఆడనున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ర్యాంకింగ్స్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

ఒక్క వారంలో భారీ జంప్

సూపర్ 8 దశలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు సంజు శాంసన్ టీ20 ర్యాంకింగ్స్‌లో 65వ స్థానంలో ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయం అందించడంతో అతడు ఒక్కసారిగా 25 స్థానాలు ఎగబాకి 40వ స్థానానికి చేరుకున్నాడు. ఆ తరువాత గత వారం సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై, ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై వరుసగా హాఫ్ సెంచరీలు సాధించడంతో మరో 18 స్థానాలు మెరుగుపరుచుకుని 637 రేటింగ్ పాయింట్లతో ప్రస్తుతం 22వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 కెరీర్‌లో శాంసన్‌కు ఇదే అత్యధిక రేటింగ్ పాయింట్లు కావడం విశేషం.

వివరాలు 

9వ స్థానానికి సూర్యకుమార్

ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. అయితే టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు దిగజారి 9వ స్థానానికి చేరాడు. అలాగే సెమీఫైనల్‌లో భారత్‌పై సెంచరీ చేసిన జాకబ్ బెతెల్ 17 స్థానాలు ఎగబాకి 16వ స్థానానికి చేరుకున్నాడు. మరో సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాపై 33 బంతుల్లోనే శతకం బాదిన ఫిన్ అలెన్ 7 స్థానాలు మెరుగుపరుచుకుని 20వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

వివరాలు 

టాప్ 5 బ్యాటర్లు

అభిషేక్ శర్మ (భారత్) - 875 రేటింగ్స్ ఇషాన్ కిషన్ (భారత్) - 871 రేటింగ్స్ షహిబ్‌జాదా ఫర్హాన్ (పాకిస్థాన్) - 848 రేటింగ్స్ ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్) - 798 రేటింగ్స్ పాథుమ్ నిస్సాంక (శ్రీలంక) - 766 రేటింగ్స్

Advertisement