Page Loader
Rekha Boj: ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్‌లో  నగ్నంగా పరిగెడతా.. తెలుగు నటీ!
ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి పరిగెడతా.. తెలుగు నటీ!

Rekha Boj: ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్‌లో  నగ్నంగా పరిగెడతా.. తెలుగు నటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2023
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో సంచలన ప్రదర్శనతో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలుగు హీరోయిన్ రేఖా భోజ్ భారత క్రికెట్ అభిమానులకు బంఫర్ ఇచ్చింది. భారత జట్టు వరల్డ్ కప్ సాధిస్తే వైజాగ్ బీచ్‌లో నగ్నంగా తిరుగుతానని టాలీవుడ్ హీరోయిన్ రేఖ భోజ్ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

Details

పబ్లిసిటి స్టంట్ అంటూ నెటిజన్లు కామెంట్లు  

2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా గెలిస్తే వైజాగ్ బీచ్‌లో బట్టల్లేకుండా తిరుగుతానని, తనకి క్రికెట్ మీద ఉన్న అభిమానంతోనే ఇలా చేస్తున్నట్లు రేఖ బోజ్ పేర్కొంది. ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. దామినీ విల్లా, మాంగళ్య, కాత్యాయిని సినిమాల్లో రేఖ బోజ్ నటించింది. గతంలో బాలీవుడ్‌లో పూనం పాండే కూడా ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే బట్టలు లేకుండా గ్రౌండ్ లో పరిగెడతానని ప్రకటించి సంచలనం సృష్టించింది. అప్పట్లో ఇది పెద్ద దుమారన్నే రేపింది. ఇదిలా ఉండగా, ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచులో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.