Page Loader
Ravichandran Ashwin: ఫైనల్‌కు ముంబయి వస్తే, ఆర్సీబీకి కష్టమే : రవిచంద్రన్ అశ్విన్
ఫైనల్‌కు ముంబయి వస్తే, ఆర్సీబీకి కష్టమే : రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin: ఫైనల్‌కు ముంబయి వస్తే, ఆర్సీబీకి కష్టమే : రవిచంద్రన్ అశ్విన్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
06:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2025 సీజన్‌ చివరి దశకు చేరుకుంది. గురువారం జరిగిన క్వాలిఫయర్‌ 1లో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ), ఫైనల్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక పంజా,బ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌, ముంబయి ఇండియన్స్‌ తుది స్థానానికి పోటీ పడుతున్నాయి. అదే సమయంలో, గుజరాత్ టైటాన్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ మరికొన్ని గంటల్లో జరగనుంది. ఇందులో ఓడిపోయిన జట్టు టోర్నీకి గుడ్‌బై చెప్పాల్సి వస్తుంది. గెలిచిన జట్టు, జూన్‌ 1న క్వాలిఫయర్‌-2లో ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఇక ఆ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే జూన్‌ 3న ఫైనల్లో బెంగళూరుతో తలపడుతుంది.

Details

ముంబయిని ఫైనల్లోకి రానివ్వకూడదు

ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ ఆఫ్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తమ తొలి ఐపీఎల్‌ టైటిల్‌ను సాధించాలంటే, ముంబయి ఇండియన్స్‌ను ఫైనల్లోకి రానివ్వకపోతే మంచిదని తన యూట్యూబ్‌ ఛానల్‌లో అభిప్రాయపడ్డాడు. "ఒకవేళ ముంబయి ఫైనల్‌కు చేరితే, ఆర్సీబీ ఆశలు చెల్లాచెదురైపోతాయి. ముంబయి గెలిస్తే అది ఆరవ టైటిల్ అవుతుంది. బెంగళూరు టైటిల్‌ గెలవాలంటే గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కొంటే బాగుంటుంది.

Details

విరాట్ కోహ్లీపై అశ్విన్ ప్రశంసలు

క్రికెట్‌లో ఏదైనా జరిగే అవకాశం ఉంది. అయినా బెంగళూరు ఇప్పుడు బలంగా కనిపిస్తోందని అన్నాడు. అశ్విన్‌ మాట్లాడుతూ విరాట్‌ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. "ఇది ఆర్సీబీ సంవత్సరం కావచ్చు. విరాట్‌ కోహ్లీ తన ఆటతీరుతో బెంగళూరు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇండియన్‌ టెస్టు క్రికెట్‌లో గొప్ప కెప్టెన్లలో ఒకరిగా పేరున్న కోహ్లీకి, కీలక మ్యాచ్‌ల్లో ఛేజింగ్‌ పట్ల గొప్ప అవగాహన ఉంది. ఫైనల్‌లో ఛేజింగ్‌ చేయాల్సిన అవసరం వస్తే, అతడి నాయకత్వంలో ఆర్సీబీ ముందంజ వేసే అవకాశాలున్నాయని చెప్పారు.