
IPL 2025: ఆపరేషన్ సిందూర్‌ను ఉటంకిస్తూ.. జైపూర్ స్టేడియంకు బాంబు బెదిరింపులు
ఈ వార్తాకథనం ఏంటి
భారత సైన్యం ఇటీవల పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
'ఆపరేషన్ సిందూర్' అనే పేరుతో ఈ దాడులు చేపట్టి, ఉగ్రగూళ్లను పూర్తిగా నాశనం చేసింది.
ఈ చర్యలో దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఫలితంగా దేశమంతా విజయోత్సాహంతో ఉత్సవ వాతావరణం నెలకొంది.
అయితే ఇదే సమయంలో రాజస్థాన్‌లోని జైపుర్ క్రికెట్ స్టేడియానికి బాంబు ముప్పు మెయిల్ రూపంలో వచ్చిన నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు వెంటనే చర్యలు తీసుకుని స్టేడియం పరిసరాలలో భద్రతను కట్టుదిట్టం చేశాయి.
స్టేడియం నిర్వహణాధికారులు ఈ మెయిల్ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
వివరాలు
మీ విజయానికి గుర్తుగా బాంబులు పేలుస్తాం
ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతోంది.
జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తమ హోం గ్రౌండ్ గా మ్యాచ్‌లు ఆడుతోంది.
మే 16న అదే వేదికపై పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది.
ఈ నేపథ్యంలో, స్టేడియం అధికారులకు ఉదయం 9.13 గంటల సమయంలో ఒక బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆ మెయిల్‌లో 'ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా మేం మీ స్టేడియంలో బాంబు పేలుడు నిర్వహించబోతున్నాం. వీలైతే ప్రతీ ఒక్కరిని రక్షించుకోండి' అని పేర్కొన్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై సంబంధిత శాఖలు పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జైపూర్ స్టేడియంకు బాంబు బెదిరింపులు
#Jaipur
— News18 Rajasthan (@News18Rajasthan) May 8, 2025
जयपुर के सवाई मानसिंह स्टेडियम को बम से उड़ाने की धमकी
अलर्ट में राजस्थान पुलिस
पुलिस प्रशासन में मचा हड़कंप, सुरक्षा दस्ता मौके पर पहुंचा@PoliceRajasthan @jaipur_police#IndiaPakistanWar #IndiaPakistanTensions #Pakistan #RajasthanNews #RajasthanWithNews18 pic.twitter.com/u1AnqGBp1h