Page Loader
World Cup 2023: విరాట్ కోహ్లీని నేనుందుకు అభినందించాలి.. శ్రీలంక కెప్టెన్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు
విరాట్ కోహ్లీని నేనుందుకు అభినందించాలి.. శ్రీలంక కెప్టెన్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు

World Cup 2023: విరాట్ కోహ్లీని నేనుందుకు అభినందించాలి.. శ్రీలంక కెప్టెన్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2023
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచులో 49వ వన్డే శతకాన్ని సాధించి, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు. ఇక విరాట్ సాధించిన ఈ ఘనతను యావత్ క్రీడా ప్రపంచ కీర్తిస్తోంది. సోషల్ మీడియా మొత్తం విరాట్ నామస్మరణతో మార్మోగిపోతోంది. అయితే శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్, విరాట్ కోహ్లీ సాధించిన ఘనతను అభినందించేందుకు నిరాకరించి, నెట్టింట్ హాట్ టాపిక్‌గా మారాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచుకు ముందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కుశాల్ మెండిస్ పాల్గొన్నాడు.

Details

సచిన్ రికార్డును సమం చేసిన కోహ్లీ

ఈ సందర్భంగా ఓ విలేకరి విరాట్ రికార్డును కుశాల్‌ను ప్రశ్నించాడు. విరాట్ 49వ వన్డే సెంచరీ సాధించినందుకు మీరు విరాట్ ను అభినందించాలని అనుకుంటున్నారా అని విలేకరి ప్రశ్నించాడు. అందుకు కుశాల్ మెండిస్ తానెందుకు అభినందనలు తెలిపాలని అని అడిగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు కుశాల్ మెండిస్‌ను ఏకి పారేస్తున్నారు. కుశాల్ సంస్కారహీనుడని,కనీస మర్యాద కూడా లేని వ్యక్తిని శ్రీలంక క్రికెట్ బోర్డు కెప్టెన్‌గా ఎలా నియమించిందని నెటిజన్లు మండిపడుతున్నారు.