IND vs WI: భారత జట్టులోకి తెలుగోడు.. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి
వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. హార్ధిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు ఆటగాడు నంబూరి తిలక్ వర్మకు తొలిసారి టీమిండియాలో చోటు లభించింది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున విజృంభించిన ఈ హైదరాబాదీ బ్యాటర్ ఎట్టకేలకు భారత జట్టులోకి వచ్చేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ తరుపున రాణించిన యశస్వీ జైస్వాల్ భారత జట్టులో భాగమయ్యాడు. అయితే రింకూసింగ్‌కు అవకాశం లభించలేదు. సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో భారత జట్టును ఎంపిక చేశారు.
వెస్టిండీస్‍లో టీ20 సిరీస్‍కు ఎంపికైన భారత జట్టు
స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు టీ20 జట్టులో అవకాశం దక్కలేదు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆగస్టు 3న వెస్టిండీస్ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అంతకుముందు విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు భారత జట్టు ఆడనుంది. భారత జట్టు ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‍మన్ గిల్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్‍దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్