IND vs WI: 200 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా భారత్ 200 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.
రెండో వన్డేలో ప్రయోగాలతో విమర్శలు ఎదుర్కొన్న భారత్ జట్టు, మూడు వన్డేలో అదే ప్రయోగాలు చేసి సత్తా చాటింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లు లేకుపోయినా యువ భారత్ జట్టు వెస్టిండీస్‌ను చిత్తు చేసింది.
మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 351 పరుగులు చేసింది. ఇషాన్ కిషాన్ (77), శుభ్‌మన్ గిల్ (85), సంజుశాంసన్(51), హార్ధిక్ పాండ్యా (70) అర్ధ సెంచరీలతో విజృంభించడంతో భారత్ 351 పరుగులు చేసింది.
Details
వరుసగా 13 వన్డే సిరీస్ లు గెలిచిన భారత్
లక్ష్య చేదనకు దిగిన విండీస్ 151 పరుగులకే అలౌటైంది. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 4, ముకేష్ కుమార్ 3 వికెట్లు పడగొట్టారు.
వెస్టిండీస్‌పై భారత్ వరుసగా 13 వన్డే సిరీస్ లను గెలుచుకుంది. ఓ ప్రత్యర్థిపై వరుసగా ఓ టీమ్ సాధించిన అత్యధిక సిరీస్ విజయాల రికార్డు ఇదే కావడం గమానార్హం.
2007 నుంచి వెస్టిండీస్ చేతుల్లో ఒక్క వన్డే సిరీస్ లోనూ టీమిండియా ఓడిపోలేదు.
ఈ సిరీస్‌లో మూడు వన్డేల్లోనూ వరుసగా హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్ ఈ ఘనత సాధించిన ఆరో ఇండియన్ ప్లేయర్‌గా నిలిచాడు. చివరిగా శ్రేయస్ అయ్యర్ 2020లో న్యూజిలాండ్‌పై వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు.