Loading...
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరికి ఛాన్స్.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు.. 
మరో ఇద్దరికి ఛాన్స్.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు..

IND vs ZIM 3rd T20: మరో ఇద్దరికి ఛాన్స్.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు.. 

వ్రాసిన వారు Moogati Shabari
Jul 26, 2026
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తో సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆదివారం (జులై 26) హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్న చివరి టీ20లోనూ విజయం సాధించి ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 2010 తర్వాత జింబాబ్వేపై ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ను పూర్తిగా వైట్‌వాష్ చేసిన భారత జట్టుగా కొత్త రికార్డు నమోదు చేస్తుంది. ఇప్పటికే సిరీస్ ఖరారైన నేపథ్యంలో బెంచ్‌లో ఉన్న యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

వివరాలు

విజయాలతో తిరిగి జోష్‌లోకి శ్రేయస్ సేన..

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిపోవడంతో విమర్శలు ఎదుర్కొన్న భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. జింబాబ్వే సిరీస్‌లో వరుస విజయాలతో జట్టును తిరిగి గెలుపు బాట పట్టించాడు.

ఈ సిరీస్‌తో టీ20 కెప్టెన్‌గా తన తొలి సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకున్న అయ్యర్.. ఇప్పుడు క్లీన్‌స్వీప్‌తో మరో ఘనతను అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

వరుస విజయాల కారణంగా భారత జట్టు ప్రస్తుతం పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.

వివరాలు

ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు ఖాయంజ..

రెండో టీ20లో ఆకట్టుకునే బౌలింగ్ ప్రదర్శన చేసిన యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు.

దీంతో అతను మూడో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తుది జట్టులో కొన్ని మార్పులు ఉండే సూచనలు ఇచ్చాడు.

ప్రిన్స్ యాదవ్ స్థానంలో తొలి టీ20లో ఆడిన పేసర్ అశోక్ శర్మకు మళ్లీ అవకాశం దక్కే అవకాశం ఉంది.

అదే సమయంలో ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయని పంజాబ్ వికెట్‌కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు తొలి మ్యాచ్ ఆడే అవకాశం లభించవచ్చు.

ఇప్పటికే వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సూర్యాంశ్ షెడ్గే కూడా తన తొలి టీ20 క్యాప్ కోసం ఎదురుచూస్తున్నాడు.

ADVERTISEMENT

వివరాలు

ఇరు జట్ల అంచనా ప్లేయింగ్ ఎలెవన్..

భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్/ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే/సూర్యాంశ్ షెడ్గే, రవి బిష్ణోయ్, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్.

జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కరన్, డియాన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మధేవెరే, తడివానాషే మరుమాని, బ్రాడ్ ఎవాన్స్, న్యూమన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవా, బ్లెసింగ్ ముజరబాని.

ADVERTISEMENT