Page Loader
IND vs PAK: భారత్ వర్సెస్ పాక్.. టికెట్ ధర తెలిస్తే.. గుండె దడపుట్టాల్సిందే!
భారత్ వర్సెస్ పాక్.. టికెట్ ధర తెలిస్తే.. గుండె దడపుట్టాల్సిందే!

IND vs PAK: భారత్ వర్సెస్ పాక్.. టికెట్ ధర తెలిస్తే.. గుండె దడపుట్టాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2025
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరల్డ్ క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ పోరు ఎప్పుడూ అభిమానులకు ఉత్కంఠను రేపుతుంది. ప్రతి మ్యాచ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజు ఉంటుంది. ఈ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే స్టేడియంలో హౌస్ ఫుల్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు అదే క్రేజుతో, భారత్-పాకిస్తాన్ జట్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో మరోసారి తలపడనున్నాయి. ఫిబ్రవరి 23న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కి బ్లాక్ మార్కెట్లు భారీగా క్యాష్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారిక టిక్కెట్లు దొరకని అభిమానులు బ్లాక్ మార్కెట్లో టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారని సమాచారం. ఈ బ్లాక్ మార్కెట్లో గమనించినట్లు టిక్కెట్ ధ‌ర 4 లక్షల రూపాయలు దాటినట్లు అంచనా వేస్తున్నారు.

Details

వరుణ్ చక్రవర్తికి అవకాశం

అయితే ఐసీసీ అధికారికంగా 5,000 దిర్హమ్ (సుమారు 1,18,240.90 రూపాయలు)గా నిర్ణయించింది. కొన్ని వెబ్‌సైట్‌లు అసలు ధరను మూడింతలు పెంచి అమ్ముతున్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్లను పంచుకుంటున్నారు. ఇప్పుడు భారత జట్టు ఇప్పటికే దుబాయ్‌లో అడుగుపెట్టింది, రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించింది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమైంది. భారత్ గెలిచి టోర్నీని విజయవంతంగా ప్రారంభించాలని భావిస్తోంది. అయితే జట్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలో హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు. అలాగే జైశ్వాల్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసి, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చారు.