Page Loader
IND vs ENG: రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌.. తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో!
రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌.. తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో!

IND vs ENG: రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌.. తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 21, 2025
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రేపు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ జరగనుంది. ఆతిథ్య భారత జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ నాయకత్వం వహిస్తుండగా, ఇంగ్లాండ్‌ జట్టుకు జోస్‌ బట్లర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇరు జట్లు ఇప్పటికే కోల్‌కతాకు చేరుకుని శనివారం నుంచి ప్రాక్టీస్‌ చేస్తున్నాయి. మూడు సంవత్సరాల తర్వాత ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టీ20 మ్యాచ్‌ జరగబోవడంతో ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భారత్‌ ఇంగ్లాండ్‌పై టీ20ల్లో అద్భుత రికార్డు కలిగి ఉంది.

Details

యువ క్రికెటర్లతో భారత జట్టు

ఇప్పటివరకు జరిగిన 24 మ్యాచ్‌లలో భారత్‌ 13 గెలవగా, ఇంగ్లాండ్‌ 11 విజయాలు సాధించింది. ఈ రికార్డు భారత జట్టు నమ్మకాన్ని మరింత పెంచుతోంది. ప్రస్తుత భారత జట్టు యువ క్రికెటర్లతో నిండివుంది. ప్రపంచ కప్‌ తర్వాత భారత్‌ తమ ఫామ్‌ను కొనసాగిస్తోంది. సంజూ శాంసన్, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, అభిషేక్‌ శర్మ, రింకు సింగ్‌, నితీష్‌ రాణా వంటి హార్డ్‌ హిట్టర్లు బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్‌ జట్టు కూడా తక్కువేం కాదు. టెస్టు క్రికెట్లో దూకుడు ఆటను నేర్పించిన మెక్‌కలమ్‌ ఇప్పుడు టీ20 కోచ్‌గా తమ ఆటను మరింత మెరుగుపరుస్తున్నారు.

Details

అభిమానుల్లో భారీ అంచనాలు

జోస్‌ బట్లర్‌, ఫిల్‌ సాల్ట్‌, లివింగ్‌స్టోన్‌, జాకబ్‌ బెటెల్‌, హ్యారీ బ్రూక్‌ లాంటి ఆందోళనకర ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇంగ్లాండ్‌ టీమిండియాపై ఒత్తిడి సృష్టించేందుకు సిద్ధమవుతుండగా, భారత యువ ఆటగాళ్లు తాము ఏమిటో చాటిచెప్పేందుకు రంగంలోకి దిగుతున్నారు. స్టేడియంలో రికార్డుల వర్షం కురిసే అవకాశం ఉన్న ఈ మ్యాచ్‌ అభిమానులలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది