LOADING...
IND Vs NZ: ఫైనల్లో భారత్.. ఏడు వికెట్లతో నిప్పులు చెరిగిన మహ్మద్ షమీ
ఫైనల్లో భారత్.. ఐదు వికెట్లతో నిప్పులు చెరిగిన మహ్మద్ షమీ

IND Vs NZ: ఫైనల్లో భారత్.. ఏడు వికెట్లతో నిప్పులు చెరిగిన మహ్మద్ షమీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2023
10:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి సెమీస్‌లో టీమిండియా విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (117), శ్రేయస్ (105) సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు చేసింది. ఇక రోహిత్ శర్మ(47), శుభమన్ గిల్(80) ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ 3 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్ ఒక వికెట్ తీశాడు.

Details

డారిల్ మిచెల్ సెంచరీ వృథా

లక్ష్య చేధనలో కివీస్ బ్యాటర్లు అద్భుతంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఓపెనర్లు కాన్వే(13), రచిన్ రవీంద్ర(13) నిరాశపరిచారు. కేన్ విలియమ్సన్(69), డారిల్ మిచెల్ (134) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. 33 ఓవర్లలో షమీ రెండు వికెట్లు పడగొట్టడంతో కివీస్ కష్టాల్లో పడింది. ఆ ఓవర్‌లో కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్‌ను షమీ ఔట్ చేసి మరోసారి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కివీస్ 48.5 ఓవర్లలో 327 పరుగులు చేసి ఆలౌటైంది. మహ్మద్ షమీ 7 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలా ఓ వికెట్ పడగొట్టారు.