కంగారులతో వన్డే సిరీస్‌కు సిద్ధమైన భారత్.. భారత్‌పై ఆసీస్‌దే ఆధిపత్యం!
త్వరలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ ముందు భారత జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. నేడు మొహాలీ వేదికగా తొలి వన్డే ప్రారంభం కానుంది. తొలి రెండు వన్డేల్లో భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ లేకుండానే భారత్ బరిలోకి దిగుతోంది. కేఎల్ రాహుల్ ఈ మ్యాచుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వన్డే ప్రపంచ కప్ జట్టులో చోటు ఖాయం చేసుకోవాలని తహతహలాడుతున్న యువ ఆటగాళ్లకు ఇది చక్కటి అవకాశం కానుంది. ఈ మ్యాచులో శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు రానున్నారు.
రవిచంద్రన్ అశ్విన్ పై అందరి దృష్టి
వన్డేల్లో టీమిండియాపై ఆస్ట్రేలియాదే ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య 146 మ్యాచులు జరగ్గా, ఆసీస్ 182 మ్యాచుల్లో నెగ్గింది. మరో 10 మ్యాచుల్లో ఓడిపోయింది. చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై అందరి దృష్టి నెలకొంది. మూడు వన్డేల షెడ్యూల్ ఇదే.. మొదటి వన్డే ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు మొహాలీ వేదికగా ప్రారంభం కానుంది. రెండో వన్డే ఈనెల 24న ఇండోర్ వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. మూడో వన్డే ఈ నెల 27న రాజ్ కోట్ వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది.