Page Loader
ENG vs IND: ఇంగ్లాండ్‌తో సిరీస్‌కి భారత్ సిద్ధం.. రోహిత్, కోహ్లీ లేకపోవడం శోచనీయం : వోక్స్ 
ఇంగ్లాండ్‌తో సిరీస్‌కి భారత్ సిద్ధం.. రోహిత్, కోహ్లీ లేకపోవడం శోచనీయం : వోక్స్

ENG vs IND: ఇంగ్లాండ్‌తో సిరీస్‌కి భారత్ సిద్ధం.. రోహిత్, కోహ్లీ లేకపోవడం శోచనీయం : వోక్స్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్, టీమిండియా (ENG vs IND) మధ్య ఐదు టెస్టుల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో భారత జట్టు ఇప్పటికే యూకేకు చేరుకుంది. ఈ సిరీస్‌లో టీమిండియా కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా బరిలోకి దిగనుంది. ఇటీవలే ఈ ఇద్దరూ టెస్టులకు వీడ్కోలు పలికారు. అంతకుముందే అశ్విన్ కూడా టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న చాలా మందికి ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం తక్కువగా ఉంది. దీంతో యువ ఆటగాళ్లు ఎలా ఆడతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్(Chris Woakes) ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Details

యువ ఆటగాళ్లు సత్తా చాటే అవకాశం

కొన్ని సంవత్సరాలపాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతంగా ప్రదర్శించారు. ఇప్పుడు వారు టెస్టుల్లో లేకపోవడం నిరాశ కలిగించే అంశమే. అయినా భారత క్రికెట్‌లో బ్యాటింగ్ డెప్త్ చాలా బలంగా ఉంది. యువ ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. భారత జట్టు ఎప్పుడూ గట్టి పోటీ ఇచ్చే జట్టే. ఎక్కడ ఆడినా వాళ్లు తమ ఆటతో ఆకట్టుకుంటారు. ఈ సిరీస్‌ మాకు కూడా కఠినమైన సవాళ్లను కలిగించనుందని వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్ లయన్స్‌, భారత్ ఎ జట్ల మధ్య రెండో అనధికార టెస్టు ప్రస్తుతం జరుగుతోంది.

Details

ఆకట్టుకున్న కేఎల్ రాహుల్

ఇందులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై 168 బంతుల్లో 116 పరుగులు చేసిన రాహుల్, తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 348 పరుగులకు చేర్చాడు. లయన్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగిన తర్వాత రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో క్రిస్ వోక్స్ మెరిశాడు. అతను 20 ఓవర్లు వేసి, యశస్వి జైస్వాల్ (17), అభిమన్యు ఈశ్వరన్ (11), కరుణ్ నాయర్ (40) వంటి కీలక ఆటగాళ్లను అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో భారత్ యువత తలపెట్టిన సవాలును ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి.