
IND Vs SA: దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటన.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరం..?
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే ప్రపంచ కప్ 2023 ముగిసిన తర్వాత భారత జట్టు (Team India) సరికొత్తగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా(Australia)తో భారత్ యువ జట్టు 5 మ్యాచుల టీ20 సిరీస్‌ను ఆడుతోంది.
సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు.
మరోవైపు డిసెంబర్ 10 నుంచి దక్షిణాఫ్రికా(South Africa)తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ లో ఓటమి టీమిండియా జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నారు.
అయితే దక్షిణాఫ్రికాతో జరిగే టీ20, వన్డేలకు ఈ ఇద్దరు దూరమవుతున్నట్లు సమాచారం.
దక్షిణాఫ్రికాతో దాదాపు నెల రోజుల పాటు భారత జట్టు పర్యటన చేయాల్సి ఉంది.
Details
విశ్రాంతి కావాలని బీసీసీఐని కోరిన విరాట్
మరోవైపు ఈ పర్యటనలో వీరిద్దరూ ఆలస్యంగా జట్టులోకి చేరే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఇప్పటికే విరాట్ కోహ్లీ వన్డే, టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కావాలని బీసీసీఐ(BCCI)కి ప్రతిపాదించినట్లు సమాచారం.
గతేడాది టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత నుంచి ఇప్పటివరకూ విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌లో క్రికెట్ ఆడలేదు.
ఇక కెప్టెన్ రోహిత్ నుంచి ఇంకా ఎలాంటి ధ్రువీకరణ రాలేదు.
టీమిండియా సీనియర్లు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ మూడు ఫార్మాట్లో ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం పరిమిత ఓవర్ల సిరీస్ లకు అందుబాటులో ఉండకపోవచ్చనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.