IND vs NZ: పీకల్లోతు కష్టాల్లో భారత్.. 29 పరుగులకే 5 వికెట్లు
భారత్,న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. మూడో రోజున, న్యూజిలాండ్ బృందం 3 పరుగులు మాత్రమే చేయడంతో 174 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో, భారత్‌కు 147 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు లక్ష్య ఛేదనలో 5 వికెట్లు నష్టానికి 29 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ 5, రోహిత్ శర్మ 11, శుభమన్ గిల్ 1, విరాట్ కోహ్లీ 1, సర్ఫరాజ్ ఖాన్ 1 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు.
సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు కుప్పకూలింది, ఇందులో భారత్ తరఫున లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టాడు. కివీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ కావడం, భారత్ 263 పరుగులు సాధించడం వలన భారత్‌కు 28 పరుగుల ఆధిక్యం ఏర్పడింది. భారత జట్టు ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన నేపథ్యంలో, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి క్లీన్ స్వీప్‌ను తప్పించుకోవాలనుకుంటోంది. అయితే, ప్రస్తుత మ్యాచ్‌ను చూస్తే అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించడానికి కూడా ఈ మ్యాచ్ భారత్‌కు చాలా ముఖ్యమైనది.