Page Loader
INDvsWI: టీ20 జట్టులోకి తెలుగు తేజం.. ఇక విండీస్ బౌలర్లకు చుక్కలే! 
ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మ

INDvsWI: టీ20 జట్టులోకి తెలుగు తేజం.. ఇక విండీస్ బౌలర్లకు చుక్కలే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 26, 2023
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే నెలలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జులై 12 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో టీమిండియా, వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది. అయితే టీ20 జట్టులో చాలా మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రకటించిన వన్డే, టెస్టు జట్లను చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకా బీసీసీఐ టీ20 జట్టును ప్రకటించలేదు. ఈ క్రమంలోనే టీ20 జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తదితర సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. విండీస్ టూర్‌లో కొత్త కుర్రాళ్లతో కూడిన టీ20 జట్టును ప్రకటిస్తున్నట్లు సమాచారం.

Details

 టీ20 జట్టులో తిలక్ వర్మకి చోటు

ఈ నేపథ్యంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మను విండీస్ పర్యటనకు ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు సిద్ధమయ్యారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్‌లో రెండో ఎలిమినేటర్ మ్యాచులో తనదైన స్టైల్‌లో అతను చెలరేగిపోయాడు. దీంతో అతనికి అవకాశం ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు అనుకుంటున్నట్లు సమాచారం. అదే జరిగితే విండీస్ పర్యటనలో తిలక్ వర్మ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించే అవకాశముంది. అతనితో పాటు రింకూసింగ్, శుభ్‌మాన్ గిల్, యశస్వీ జైస్వాల్‌ను టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తారని తెలుస్తోంది.