
DC vs MI : తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన బాధలో ఉన్న అక్షర్ పటేల్.. షాక్ ఇచ్చిన బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ తొలి ఓటమిని మూటగట్టుకుంది.
ఆదివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 12 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
ఓటమితోనే కాకుండా,జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్‌కు ఐపీఎల్ నిర్వాహకులు భారీ షాక్ ఇచ్చారు.
అతనిపై రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడింది.
నిర్ణీత సమయానికి గాను అవసరమైన ఓవర్లు పూర్తిచేయడంలో జట్టు విఫలమైంది.
దీంతో ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ సదరు నిబంధనల మేరకు కెప్టెన్ అక్షర్ పటేల్‌కు జరిమానా విధించింది.
ఈసీజన్‌లో ఢిల్లీ జట్టు స్లో ఓవర్ రేట్ నిబంధనను అతిక్రమించిన తొలి సందర్భం కావడంతో,రూ.12 లక్షల ఫైన్‌కు గురయ్యారు.
వివరాలు
ఆరుగురు కెప్టెన్లు స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించారు
ఈ విషయాన్ని బీసీసీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.బీసీసీఐ
"ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన టాటా ఐపీఎల్ 2025 యొక్క మ్యాచ్ నెం. 29లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్లో ఓవర్ రేట్‌కు పాల్పడినందుకు జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, కనీస ఓవర్ రేట్ నిబంధన ఉల్లంఘనకు ఇది ఈ సీజన్‌లో జట్టు చేసిన తొలి తప్పిదం కావడంతో,పటేల్‌పై రూ.12లక్షల జరిమానా విధించాం" అని పేర్కొంది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇప్పటివరకు అక్షర్ పటేల్‌తో కలిపి మొత్తం ఆరుగురు కెప్టెన్లు స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించారు.
వారిలో సంజు సామ్సన్,రియాన్ పరాగ్,హార్దిక్ పాండ్యా,రిషబ్ పంత్, రజత్ పాటిదార్ ఉన్నారు.
వివరాలు
విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు
మ్యాచ్ వివరాలకు వస్తే..ముంబై ఇండియన్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ 33 బంతుల్లో 59 పరుగులతో అర్థశతకాన్ని నమోదు చేశాడు.
సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 40 పరుగులు చేశాడు. రికిల్‌టన్ 25 బంతుల్లో 41 పరుగులు చేయగా,నమన్ ధీర్ 17 బంతుల్లో 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
బౌలింగ్ విభాగంలో ఢిల్లీ తరఫున విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.
వివరాలు
ధాటిగా ఆడిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్
ముకేశ్ కుమార్‌కు ఒక వికెట్ దక్కింది. తర్వాత లక్ష్యచేధనలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ ధాటిగా ఆడాడు.
అతను 40 బంతుల్లో 89 పరుగులు (12 ఫోర్లు, 5 సిక్సర్లు) సాధించాడు. అయినప్పటికీ, జట్టు మొత్తం 19 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌట్ అయింది.
ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ మూడు వికెట్లు, మిచెల్ సాంట్నర్ రెండు వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రా ఒక వికెట్ తీసి విజయాన్ని జట్టుకు అందించారు.