Loading...
IPL 2027 Auction: ఐపీఎల్‌ 2027 నుంచి స్టార్క్‌, హెడ్‌ ఔట్
ఐపీఎల్‌ 2027 నుంచి స్టార్క్‌, హెడ్‌ ఔట్

IPL 2027 Auction: ఐపీఎల్‌ 2027 నుంచి స్టార్క్‌, హెడ్‌ ఔట్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 18, 2026
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే పలు ఫ్రాంచైజీలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలను ప్రకటించిన జట్లు.. కొందరు స్టార్ క్రికెటర్లకు వీడ్కోలు పలికాయి. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, బ్యాటర్ ట్రావిస్ హెడ్, ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెథెల్‌తో పాటు ట్రెంట్ బౌల్ట్, షిమ్రాన్ హెట్‌మయర్ వంటి ప్రముఖులు విడుదలైన జాబితాలో ఉన్నారు. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా స్టార్క్, హెడ్ వంటి ఆటగాళ్లు జట్టులో లేకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

Details

పని ఒత్తిడితో స్టార్క్, హెడ్ దూరం

ఢిల్లీ క్యాపిటల్స్ మిచెల్ స్టార్క్‌ను, సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రావిస్ హెడ్‌ను విడుదల చేశాయి. అయితే వీరిద్దరినీ వదులుకోవడం వెనుక అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్, పని ఒత్తిడి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.

ఆస్ట్రేలియా జట్టు డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో నాలుగు టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత భారత్‌తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, మార్చిలో 150వ వార్షిక టెస్టు ఉన్నాయి.

దీంతో పాటు యాషెస్ సిరీస్ వంటి కీలక పోటీలు కూడా ఉన్నాయి. మరోవైపు జాకబ్ బెథెల్ మోకాలి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న సమయంలో తిరిగి గాయం కావడంతో 2027 సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.

Details

రూ.14.2 కోట్ల ఆటగాడిని వదులుకున్న సీఎస్‌కే

ఈ విడుదలల జాబితాలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సీఎస్‌కేకు చెందిన ప్రశాంత్ వీర్ నిలిచాడు.

రూ.14.2 కోట్ల విలువైన అతడిని చెన్నై విడుదల చేసింది. రూ.14 కోట్ల విలువైన ట్రావిస్ హెడ్ రెండో స్థానంలో ఉన్నాడు.

మరోవైపు 19 సీజన్ల పాటు ఐపీఎల్‌లో ఆడిన ఎంఎస్ ధోనీ కూడా ఆటగాడిగా తన ప్రయాణాన్ని ముగించడంతో సీఎస్‌కే జాబితాలో చోటు దక్కించుకోలేదు.

ఆయన ఇకపై మెంటార్‌గా వ్యవహరించనున్నారు. ఈసారి వేలానికి ముందు చెన్నై తన పర్స్‌లో రూ.28.05 కోట్లు ఉంచుకోగా, ముంబై ఇండియన్స్ వద్ద రూ.32.6 కోట్లు ఉన్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.40.15 కోట్లతో వేలానికి సిద్ధమవుతోంది. దీంతో డిసెంబర్ 16న జరిగే వేలంలో ఏ జట్టు ఎవరిని దక్కించుకుంటుందనే ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT