Hardik Pandya: రోహిత్ శర్మ తర్వాత భారత వన్డే కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడుతున్న టీమిండియా, తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగనుంది.
రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది.
అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు అనుకూల ఫలితాలు రాకపోతే జట్టులో కీలక మార్పులు ఉంటాయని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఓ ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్ కథనం ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పరాజయం పాలైతే హర్ధిక్ పాండ్యాను వన్డే కెప్టెన్‌గా నియమించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.
Details
హార్దిక్‌కు కెప్టెన్సీ అవకాశమా?
భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యను వైస్ కెప్టెన్‌గా నియమించాలని కోరుకున్నట్లు సమాచారం.
కానీ ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్ సారథ్యం సూర్యకుమార్ యాదవ్ దగ్గర ఉంది.
అయితే అతని ఫామ్ స్థిరంగా లేకపోవడంతో, పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు.
Details
వన్డేలకు గుడ్ బై చెప్పే యోచనలో రోహిత్ శర్మ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా ఫలితాలపై ఆధారపడి రోహిత్ శర్మ వన్డేలకు గుడ్‌బై చెప్పే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, హార్దిక్ పాండ్య మెరుగైన ప్రదర్శన కనబరిస్తే అతడే వన్డే జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది.
హార్దిక్‌కు అన్యాయం జరిగిందని బీసీసీఐలోని కొందరు సభ్యులు భావిస్తున్నట్లు, గంభీర్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Details
గిల్‌ను తప్పించాలన్న కారణాలు ఏమిటి?
ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో యశస్వి జైస్వాల్ విఫలమవగా, శుభ్‌మన్ గిల్ మాత్రం అద్భుతంగా రాణించాడు. కానీ, మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, హర్భజన్ సింగ్‌లు మాత్రం గిల్ కంటే యశస్వికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
దీనిపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఘాటుగా స్పందించాడు. గిల్‌ను జట్టులోనే ఉంచొద్దని కొందరు చేసిన వ్యాఖ్యలు విన్నానని, వారు ఏం ఆలోచిస్తున్నారో అర్థంకావడం లేదన్నారు.
ఆసీస్ పర్యటనలో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడాడని, ఆ తర్వాత రంజీ ట్రోఫీలో సెంచరీ చేశారని గుర్తు చేశారు. ఇలాంటి ఆటగాడి స్థానాన్ని ప్రశ్నించే అవసరమే లేదని చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత జట్టులో మరిన్ని మార్పులు వచ్చే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.