Page Loader
WI vs IND: టీమిండియాపై వెస్టిండీస్ గెలుపు సాధ్యమేనా..?
వెస్టిండీస్, టీమిండియా మధ్య రేపు రెండో టెస్టు మ్యాచ్

WI vs IND: టీమిండియాపై వెస్టిండీస్ గెలుపు సాధ్యమేనా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2023
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ ఓటమిపాలైంది. ప్రస్తుతం రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాలని విండీస్ జట్టు భావిస్తోంది. మరోవైపు రెండో టెస్టు మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. రెండో టెస్టు మ్యాచ్ ట్రినిడాడ్ వేదికగా జులై 20న ప్రారంభ కానుంది. మొదటి టెస్టులో కనీసం పోటీ ఇవ్వలేని విండీస్, రెండో టెస్టులో నైనా రాణిస్తుందో లేదో వేచి చూడాలి. క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానం ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండనుంది. మ్యాచ్ సాయంత్రం 7:30గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Details

రెండో టెస్టు మ్యాచులో బద్దలయ్యే రికార్డులివే

వెస్టిండీస్ జట్టుపై 99 టెస్టులాడిన టీమిండియా 23 విజయాలను, 30 ఓటములను చవిచూసింది. క్వీన్స్ పార్క్ ఓవల్‌లో మైదానంలో వెస్టిండీస్ 61 టెస్టు మ్యాచ్‌లు ఆడి 20 గెలుపొందింది. ఇక టీమిండియా 13 టెస్టుల్లో మూడుసార్లు మాత్రమే గెలుపొందింది. ఇక రెండో టెస్టు మ్యాచులో విరాట్ కోహ్లీ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు. సచిన్ టెండూల్కర్, ధోనీ , రాహుల్ ద్రావిడ్ తర్వాత అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన నాల్గవ ఇండియన్ ప్లేయర్ గా కోహ్లీ నిలవనున్నాడు. స్పిన్నర్ అశ్విన్‌కి విదేశీ టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని చేరేందుకు ఇంకా ఐదు వికెట్ల దూరంలో ఉన్నాడు. రోహిత్ శర్మ విదేశీ టెస్టుల్లో 1,500 పూర్తి చేయడానికి ఇంకా 84 పరుగలు చేయాలి.